Begin typing your search above and press return to search.

సెలబ్రిటీ క్రికెట్ షెడ్యూల్ ఆగయా.. తెలుగు టీంకు కెప్టెన్ ఎవరంటే

By:  Tupaki Desk   |   29 Jan 2023 8:00 AM GMT
సెలబ్రిటీ క్రికెట్ షెడ్యూల్ ఆగయా.. తెలుగు టీంకు కెప్టెన్ ఎవరంటే
X
దాదాపు మూడేళ్ల విరామం త‌ర్వాత సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ సందడి ప్రారంభం కానుంది. ఇందులో వెండితెరపై తమ యాక్టింగ్‌తో ఫాన్సను అల్లరించే సినిమా స్టార్స్ గ్రౌండ్‌లో బ్యాట్ తో సందడి చేయనున్నారు. తమ విన్యాసాలతో ఫాన్స్ లో జోష్ నింపనన్నారు. సినిమాల్లో అలరించే స్టార్స్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడనున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం ఫ్యాన్స్ ఇప్పటికే ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, భోజ్‌పురి, బెంగాళీ, పంజాబీ, హిందీ భాష‌ల‌కు చెందిన పలువురు నటులు భాగం కానున్నారు. ఈ మేరకు సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ 2023 షెడ్యూల్‌ను శ‌నివారం ప్రకటించారు. ఫిబ్ర‌వ‌రి 18న మొదలుకానున్నట్లు పేర్కొన్నారు. ఇది తెలుసుకున్న సినీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మ్యాచ్ చూసేందుకు ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారు.

మ్యాచ్ వివరాలు: ఫిబ్ర‌వ‌రి 18 నుంచి మార్చి 19 వ‌ర‌కు ఈ సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ జ‌రుగ‌నుంది. ఇందులో మొత్తం ఎనిమిది టీమ్‌లు పోటీప‌డ‌నున్నాయి. తెలుగు వారియ‌ర్స్‌, బెంగాల్ టైగ‌ర్స్‌, చెన్నై రినోస్‌, కేర‌ళ స్ట్రైక‌ర్స్‌, క‌ర్ణాట‌క బుల్డోజ‌ర్స్‌, ముంబై హీరోస్‌, భోజ్‌పురి ద‌బాంగ్స్‌, పంజాబ్ దే షేర్స్ టీమ్స్ పోటీప‌డ‌నున్నాయి. ఇందులో తెలుగు వారియ‌ర్స్ టీమ్‌కు యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. క‌న్న‌డ టీమ్‌కు కిచ్చా సుదీప్‌, చెన్నై టీమ్‌కు ఆర్య కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

తొలి మ్యాచ్‌ బెంగాల్ టైగ‌ర్స్ - క‌ర్ణాట‌క బుల్డోజ‌ర్స్ మ‌ధ్య జ‌రుగ‌నుంది. అదే రోజు చెన్నై రినోస్ తో ముంబయి హీరోస్ త‌ల‌ప‌డ‌నుంది. తెలుగు వారియ‌ర్స్ త‌మ తొలి మ్యాచ్‌లో కేర‌ళ స్ట్రైక‌ర్స్‌తో ఫిబ్ర‌వ‌రి 19న మొద‌టి మ్యాచ్ ఆడ‌నున్నారు. ల‌క్నో, జైపూర్‌, బెంగ‌ళూరు, త్రివేండ్రం, జోధ్‌పూర్‌, హైద‌రాబాద్‌ల‌లో సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. ఫైన‌ల్ మ్యాచ్‌కు హైద‌రాబాద్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

బ్రాండ్ అంబాసిడ‌ర్స్‌గా... ఇందులో తెలుగు టీమ్‌కు వెంక‌టేష్ బ్రాండ్ అంబాసిడ‌ర్స్‌గా వ్యవహరిస్తుండగా.. బాలీవుడ్ టీమ్‌కు స‌ల్మాన్‌ఖాన్‌, కేర‌ళ జట్టుకు మోహ‌న్‌లాల్ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇక ఈ మ్యాచ్ లు చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.