స్టార్స్ కు కోట్లు కురిపిస్తున్న ఫ్యాన్స్ అభిమానం

Wed Jul 08 2020 15:00:54 GMT+0530 (IST)

celebraties earning huge money from instagram ads

స్టార్స్ ఇంకా సెలబ్రెటీలు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఫేస్ బుక్ ట్విట్టర్ పై దృష్టి పెట్టిన స్టార్స్ ఇప్పుడు ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లపై దృష్టి పెడుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆదాయం వస్తున్న కారణంగానే వారు అభిమానులను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో స్టార్స్ నమ్మశక్యం కానంత మొత్తంను సంపాదిస్తున్నారు.హాలీవుడ్ స్టార్ డాన్ జాన్సన్ ఇన్ స్టాగ్రామ్ లో ఒక్క యాడ్ పోస్ట్ పెట్టినందుకు గాను ఏకంగా 7.6 కోట్ల రూపాయలను పొందుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన కోట్లాది మంది అభిమానులు ఆయనకు ఒక్కో పోస్ట్ కు కోట్లు కురిపిస్తున్నారు.

ఇక ఇండియాకు చెందిన పలువురు స్టార్స్ కూడా ఇన్ స్టాగ్రామ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ఇండియాలో అత్యధికంగా ప్రియాంక చోప్రా ఇన్ స్టాగ్రామ్ సంపాదన కలిగి ఉంది. ఈమె ఒక్కో పోస్ట్ కు ఏకంగా రూ.2.16 కోట్లను పొందుతుంది. దాదాపుగా అయిదున్నర కోట్ల మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ప్రియాంక చోప్రా అత్యధిక సంపాదన కలిగి ఉంది.

ఒక్క సినిమా చేస్తే అయిదు నుండి పది కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అదే రెండు మూడు పోస్ట్ పెడితే ఎలాంటి రిస్క్ కష్టం లేకుండా అభిమానుల అభిమానం కారణంగా పది కోట్ల వరకు ఈ అమ్మడు పొందుతుంది. ఇలా స్టార్స్ కు వారి అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న కారణంగా కోట్లు కురుస్తున్నాయి.