Begin typing your search above and press return to search.

సీసీసీ ఈ ప‌ని చేయ‌క‌పోతే ఇండ‌స్ట్రీ డెఫ‌నేట్ గా ఖాళీ

By:  Tupaki Desk   |   9 April 2020 4:30 AM GMT
సీసీసీ ఈ ప‌ని చేయ‌క‌పోతే ఇండ‌స్ట్రీ డెఫ‌నేట్ గా ఖాళీ
X
మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) తెరాస ప్ర‌భుత్వంతో క‌లిసి సినీకార్మికుల‌కు సాయ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సుమారు 6 కోట్లు పైగా నిధి జ‌మ అవ్వ‌డంతో వీటితో సామాజిక కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున‌ చేస్తున్నారు వ‌లంటీర్లు. ఇందుకోసం ఏకంగా 30 మంది వ‌ర‌కూ వ‌లంటీర్లు ప‌ని చేస్తున్నార‌ని తెలుస్తోంది.

అయితే సినీఇండ‌స్ట్రీలో రోజువారీ భ‌త్యంతో బ‌తికే కార్మిక కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? వీళ్ల‌ను ఎన్నిరోజులు.. ఎన్ని నెల‌ల పాటు ఆదుకోవాలి? అన్న‌దానిపై ఏమాత్రం స్ప‌ష్ఠ‌త లేదు. ప్ర‌తిసారీ వేలాది మంది కార్మికులు టాలీవుడ్ పై ఆధార‌ప‌డి జీవిస్తున్నార‌ని ప‌లువురు పెద్ద‌లు ప‌లు వేదిక‌ల‌పై అన‌డ‌మే కానీ దేనికీ అధికారిక లెక్క‌లు అయితే వెలువ‌రించ‌లేదు. అయితే 24 శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న కార్మికుల్లో వారి వారి ఆర్థిక స్థితిగ‌తుల‌పై అవ‌గాహ‌న ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వీరిని ఆదుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది. అలాగే అసంఘ‌టిత రంగంలో అస‌లు అసోసియేష‌న్ల‌తో ప‌నే లేకుండా బ‌తికే కార్మికుల కుటుంబాల్ని ఆదుకునే నాథుడెవ‌రు? అన్న‌ది ఇప్పుడు మ‌రీ స‌స్పెన్స్ గా మారింది. ఈ క‌ష్ట‌కాలంలో అస‌లు క‌నీసం తిండికి లేకుండా ప‌స్తులుండే కార్మికుల్ని గుర్తించ‌డం అన్న‌ది పెను స‌వాల్ అనే చెప్పాలి.

ఇందులో గూడుపుటానీల‌కు ఆస్కారం లేకుండా సీసీసీ క‌మిటీ పెద్ద‌లు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా- ఎన్.శంక‌ర్ త‌దిత‌రులు ఎంతో నిజాయితీని క‌న‌బ‌ర‌చాల్సి ఉంటుంది. ఇటీవ‌ల ఓ సంద‌ర్భంలో మెగాస్టార్ చిరంజీవి దాదాపు 12 వేల మంది కార్మికులు 24 శాఖ‌ల్లో ప‌ని చేస్తున్నార‌ని గుర్తించిన‌ట్టు వెల్ల‌డించారు. వీళ్ల‌లో అసోసియేష‌న్ల‌తో సంబంధం లేని వాళ్లు ఎంద‌రున్నారు? అంటే వారితో సంబంధం కాకుండానే .. అధికారిక లెక్క ఇద‌ని భావించాల్సి ఉంటుంది. ఇక ఇందులో దాదాపు 600 కుటుంబాల‌కు నిత్యావ‌స‌రాల్ని అంద‌జేసారు ఇప్ప‌టికే. ఇంకా అందాల్సిన కార్మికుల సంఖ్య విశేషంగా ఉంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇక 12 వేల మంది కార్మికుల్ని ఆదుకోవాలంటే కేవ‌లం సీసీసీ ఫండ్ స‌రిపోతుందా? అందుకే ఈ విప‌త్తును ఎదుర్కొని కార్మికుల కుటుంబాలు రోడ్డున ప‌డ‌కుండా కాపాడేందుకు పారిశ్రామిక వేత్త‌ల్ని సాయం కోరేందుకు మెగాస్టార్ చిరంజీవి బృందం రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. ఇది తెరాస ప్ర‌భుత్వం తో క‌లిసి సీసీసీ చేస్తున్న జాయింట్ ఆప‌రేష‌న్ అనే చెప్పాలి. ఇక సీసీసీ కానీ తెరాస ప్ర‌భుత్వం కానీ ఇలాంటి ప్ర‌య‌త్నాన్ని చేయ‌క‌పోతే ఆల్మోస్ట్ ఇండ‌స్ట్రీ ఖాళీ అయిపోవ‌డం ఖాయం. కార్మికులు దొర‌క్క నిర్మాణం ఆగిపోతే ఇండ‌స్ట్రీ అల్ల క‌ల్లోలం అవుతుంది మ‌రి. ఇక్క‌డంతా చైన్ ప్రాసెస్ కాబ‌ట్టి అది అట‌కెక్కేస్తుంది.