Begin typing your search above and press return to search.

'ఫిగర్'తో కేకపుట్టిస్తున్న గోపీచంద్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   26 May 2020 2:42 PM GMT
ఫిగర్తో కేకపుట్టిస్తున్న గోపీచంద్ హీరోయిన్!
X
తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు కేథరిన్ ట్రెసా. కేరళకు చెందిన కేథరిన్. దుబాయ్‌లో చదువు పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వచ్చి ఇక్కడే మోడలింగ్‌ మొదలుపెట్టింది. తర్వాత యాడ్స్‌లో రాణించిన కేథరిన్‌కు కన్నడ ఇండస్ట్రీ నుంచి మొదటి పిలుపొచ్చింది. ఇక 2010లో శంకర్ ఐపీఎస్ సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది ఈ అమ్మడు. అదే ఏడాది ది థ్రిల్లర్ అనే సినిమాతో మలయాళంలో తొలి సినిమా చేసింది. మళ్లీ రెండేళ్లు విరామంలో మోడలింగ్ లో బిజీ అయింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ 2013లో వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన 'ఛమ్మక్ ఛల్లో' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. అప్పటి నుండి ఈ కేథీ బేబీ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. చాలా వరకు రెండో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికి నటిగా తనని తను నిరూపించుకునే పాత్రల కోసం ట్రై చేస్తోంది. చివరగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ ఏడాది విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్‌ సినిమాలో స్మితా మేడం పాత్రలో ఆకట్టుకుంది. కేథరిన్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటో షూట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎప్పటికైనా ఎలాగైనా ఇండ‌స్ట్రీలో పాతుకుపోవాల‌ని.. ఇక్క‌డే స్టార్ హీరోయిన్ అయిపోవాల‌ని తెగ ట్రై చేస్తుంది కేథ‌రిన్ థ్రెసా. స్వ‌త‌హాగా బాగా రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ పాప‌కు సినిమాలంటే పిచ్చి. అందుకే ఇక్క‌డ త‌న స‌త్తా చాటాలని చూస్తుంది. ఇప్ప‌టికే బ‌న్నీ లాంటి స్టార్ హీరో కూడా రెండుసార్లు ఆఫ‌ర్ ఇచ్చాడు. కానీ అమ్మడికి అదృష్ట‌మే క‌లిసి రావ‌డం లేదు. టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియన్ స్టార్స్ కూడా ప్రస్తుతం కేథీని ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ అందాలే పెట్టుబ‌డిగా దూసుకెళ్తుంది గుమ్మ.

2017లో విడుద‌లైన గౌత‌మ్ నందాలో గ్లామ‌ర్ షో అంతా ఈ భామదే. ఏకంగా బికినీ ధరించడానికి కూడా సిద్ధమైంది కేథీ. కేథ‌రిన్ బికినీ సీన్ ను వేడి పుట్టించేలా షూట్ చేసాడు సంపత్ నంది. ఇంత చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయ్యేస‌రికి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. గౌత‌మ్ నంద విడుద‌ల‌కు ముందే హైద‌రాబాద్ లోనే ఓ ఇళ్లు కూడా కొనేసింది ఈ బ్యూటీ. ఏదో టైమ్ పాస్ కోసం సినిమాలు చేయ‌డం మిన‌హా.. ఆమెకు ఆస్తుల‌కు కొద‌వ‌లేదు. ఎప్ప‌టికైనా త‌న‌కు సోలో హీరోయిన్ రోల్స్ వ‌స్తాయ‌నే ఆశ‌లో ఉంది. ఇక ప్రస్తుతం అమ్మడు సోషల్ మీడియాను ఫోటో ఫోజులతో హీటెక్కిస్తోంది. తాజాగా అమ్మడి ఫోటోలో కిక్కెక్కించే అందాలు మత్తెక్కిస్తున్నాయి. అమ్మడి గ్లామర్ షోకి కొదవలేదు. చూడాలి మరి ఈ గ్లామర్ ద్వారా అయినా ఇకపై సోలో హీరోయిన్ గా సెటిల్ అవుతుందేమో!