బాలీవుడ్ నటుడి కొడుకుపై లైంగిక దాడి కేసు

Sat Oct 17 2020 19:40:29 GMT+0530 (IST)

case against Bollywood actor son

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ చక్రవర్తి పై రేప్ కేసు నమోదైంది. ఓ యువతి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని.. చివరకు మోసం చేశాడని మహాక్షయపై ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.మహాక్షయ తనతో నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడని.. అనంతరం పెళ్లి మాట ఎత్తితే తనను మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు.

ఇక తాను గర్భం దాల్చడంతో బలవంతంగా తనకు అబార్షన్ చేయించారని.. కేసు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని మహాక్షయ తల్లి యోగితా బాలి కూడా తనను బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో కూడా మహాక్షయపై ఇలాంటి ఆరోపణలే కొందరు వర్ధమాన నటీమణులు చేశారు. రెండేళ్ల క్రితం భోజ్ పురి నటిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి రేప్ చేశాడని..గర్భస్రావం కూడా చేయించినట్లు మహాక్షయపై ఆరోపణలు వచ్చాయి. తాజా మరో యువతి అతడిపై పోలీస్ స్టేషన్ గడప తొక్కడం కలకలం రేపింది.