టాలీవుడ్ హీరోల బ్రోమాన్స్..!

Fri Jun 11 2021 16:00:01 GMT+0530 (IST)

bromance of Tollywood Heroes

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు హీరోలందరూ ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతుంటారు. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లోనే కాకుండా ప్రైవేట్ పార్టీస్ కూడా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ జనరేషన్ హీరోలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాల విషయంలో పోటీ పడినా రియల్ లైఫ్ లో చాలా వరకు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. అలాంటి టాలీవుడ్ హీరోలు.. వారి మధ్య బ్రోమాన్స్ (స్నేహబంధం) గురించి ఇప్పుడు చూద్దా!మహేష్ బాబు - రామ్ చరణ్: వయసులో తేడా ఉన్న వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. షూటింగుల సమయంలో లొకేషన్స్ కి వెళ్లి మరీ ముచ్చటిస్తుంటారు. వీరే కాకుండా కుటుంబ సభ్యులు కూడా అంతే సన్నిహితంగా ఉంటారు. ఇద్దరిలో ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే స్పందిస్తుంటారు. ఇప్పుడు చరణ్ కు బాంబే మీడియాలో పాపులారిటీ తేవడానికి మహేశ్ కృషి చేస్తున్నాడనే టాక్ ఉంది.

రామ్ చరణ్ - ఎన్టీఆర్: టాలీవుడ్ లోని రెండు పెద్ద ఫ్యామిలీలకు చెందిన వీరిద్దరూ ఇప్పుడు కలసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. ఇప్పటి వరకు స్నేహితులుగానే ఉన్న వీరు.. సినిమా చేస్తున్న క్రమంలో ఒకరిపై ఒకరు సోదర భావం అలవరుచుకున్నారు. ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరి ఫ్యామిలీలు కూడా క్లోజ్ గా మూవ్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ - అల్లు అర్జున్: వీరిద్దరూ చాలా చనువుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఒకరినొకరు 'బావా' అని ప్రేమగా పిలుచుకుంటారు. సరదాగా ఫ్యామిలీస్ లో కలిసి ట్రిప్స్ వేస్తుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అభిమానాన్ని చూపిస్తుంటారు.

అల్లు శిరీష్ - నిఖిల్ సిద్ధార్థ్: ఈ ఇద్దరు యువ హీరోలు టెక్నాలజీ అంటే బాగా ఇష్టపడుతుంటారు. రెగ్యులర్ గా టచ్ లో ఉండే వీరిద్దరూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రస్తుతం ఇద్దరు ప్రేమ కథా చిత్రాలే చేస్తున్నారు. నిఖిల్ కి గీతా ఆర్ట్స్ లో సినిమా రావడానికి వెనుక శిరీష్ తోడ్పాటు ఉందని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ - నవీన్ పోలిశెట్టి: వీరిద్దరూ తమ బడ్డింగ్ స్టేజ్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. స్టేజ్ ఆర్టిస్టులుగా చేసిన ఇద్దరు యంగ్ హీరోలు.. ఎలాంటి సపోర్ట్ లేకుండా తమ టాలెంట్ ని నమ్ముకుని టాలీవుడ్ లో తమకంటూ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకున్నారు. వీరిద్దరి కెరీర్ దాదాపుగా ఒకేలా కొనసాగింది. స్టార్స్ గా మారాక కూడా వీరి స్నేహం కొనసాగుతోంది. విజయ్ కు బాలీవుడ్ పరిచయాలు చేయడంలో నవీన్ ముందుంటాడు.

నాగశౌర్య - బెల్లంకొండ శ్రీనివాస్: వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ మీడియాకి అభిమానులకు తెలియదు. బెల్లంకొండ శ్రీను తాను వేసే ప్రతి స్టెప్ శౌర్యతో డిస్కస్ చేసే తీసుకుంటాడట. అలానే శౌర్యకి ఫిట్ నెస్ విషయంలో అల్లుడు శ్రీను హెల్ప్ చేస్తుంటాడని తెలుస్తోంది.

సాయి తేజ్ - సందీప్ కిషన్: ఈ ఇద్దరు యంగ్ హీరోలు చాలా క్లోజ్ గా ఉంటారని ఇండస్ట్రీ జనాలు చెబుతుంటారు. ఇద్దరూ హ్యాంగ్ అవుట్ చేయడంలో ది బెస్ట్ అని ఇండస్ట్రీ టాక్. సందీప్ ఫీల్ అయిన ప్రతిసారీ కిక్ ఇచ్చే సబ్జెక్ట్ సాయితేజ్ అని అంటుంటారు.

మహేష్ - ఎన్టీఆర్: టాలీవుడ్ స్టార్ హీరోలైన వీరిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎక్కువున్నా బాగా కలిసిపోయారు. మహేష్ ను అన్నయ్య అని పిలుస్తుంటారు తారక్. ఇద్దరు ఫ్యామిలీస్ తో కలసి పార్టీలు కూడా చేసుకుంటారు. ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారు.

అఖిల్ - చరణ్: చిరంజీవి - నాగార్జున మాదిరిగానే వీరి కుమారులు కూడా స్నేహంగా మెలుగుతుంటారు. అఖిల్ తరచుగా చెర్రీ తో కలుస్తూ కెరీర్ గైడెన్స్ తీసుకుంటుంటాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తో అఖిల్ చేస్తున్న సినిమా వెనుక చరణ్ హస్తం ఉందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

మంచు మనోజ్ - సాయి తేజ్: మెగా - మంచు ఫ్యామిలీలకు చెందిన వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. బాబాయ్ అని పిలుచుకుంటూ ఉంటారు. అనేక సందర్భాల్లో వీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు.

టాలీవుడ్ హీరోల్లో వీరే కాకుండా రామ్ చరణ్ - శర్వానంద్.. రానా దగ్గుబాటి - అల్లు అర్జున్.. ప్రభాస్ - రానా.. మహేష్ - సుమంత్.. వంటి వారు మంచి స్నేహితులుగా ఉన్నారు.