Begin typing your search above and press return to search.

బుట్టబొమ్మకు కడుపులో ఉన్న బిడ్డ కూడా రెస్పాండ్‌

By:  Tupaki Desk   |   18 Feb 2020 4:58 PM GMT
బుట్టబొమ్మకు కడుపులో ఉన్న బిడ్డ కూడా రెస్పాండ్‌
X
సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలోని పాటలన్నీ కూడా ఇంకా కూడా దుమ్ము రేపుతూనే ఉన్నాయి. థమన్‌ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు యూట్యూబ్‌ లో ఏ స్థాయి రికార్డులను నమోదు చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. రాములో రాముల పాట ఇటీవలే 200 మిలియన్‌ వ్యూస్‌ ను సొంతం చేసుకుంది. ఇక బుట్ట బొమ్మ మరియు సామజవరగమన పాటలు కూడా యూట్యూబ్‌ లో ఇంకా ట్రెండ్‌ అవుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా బుట్ట బొమ్మ పాటకు టిక్‌ టాక్‌ లో వస్తున్న వీడియోలు మామూలుగా లేవు. బాలీవుడ్‌ సెలబ్రెటీలు కూడా బుట్టబొమ్మకు ఫిదా అయ్యి వీడియోలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అవుతున్న బుట్టబొమ్మ మరో అద్బుతమైన ఫీట్‌ ను సొంతం చేసుకుంది. ఈ పాటను ఒక తల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా విని రెస్పాండ్‌ అవ్వడం జరిగింది. ఇది నిజంగా అద్బుతం అంటూ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్‌ చేశాడు.

ఇలాంటి అద్బుతంలో తనను భాగస్వామి చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. బయట శబ్దాలకు కడుపులో ఉన్న పిల్లలు రెస్పాండ్‌ అవ్వడం జరుగుతుందని.. ఆరవ నెల నుండి పిల్లలు కదలడం రెస్పాండ్‌ అవ్వడం చేస్తారని.. కాని చాలా రేర్‌ గా మాత్రమే అది జరుగుతుంది. అలాంటిది బుట్ట బొమ్మ పాట వచ్చినప్పుడు లోపల బేబీ రెస్పాండ్‌ అవ్వడంతో పాట స్థాయి మరింత పెరిగినట్లయ్యింది.

వీడియో కోసం క్లిక్ చేయండి