జక్కన్న ప్రాజెక్ట్ కోసం వెంటపడుతున్నారట?

Tue Jan 24 2023 15:00:02 GMT+0530 (India Standard Time)

bollywood producers on rajamouli

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ హాట్ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఏ స్టార్ హీరోని కదిలించినా రాజమౌళి జపం చేస్తుండటం విశేషం. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ మల్లూవుడ్ శాండల్ వుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. తనతో సినిమా చేస్తే వచ్చే డబ్బు కంటే పాపులారిటీని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు.ఇక ఇదే స్థాయిలో ప్రొడ్యూసర్స్ కూడా టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు జక్కన్న కోసం ఎదురు చూస్తున్నారు. తనతో ఒక్కటంటే ఒక్క సినిమా చేయాలని క్యూ కడుతున్న నిర్మాతలు చాలా మందే వున్నారని తెలుస్తోంది. ఇదిలా వుంటే ప్రస్తుతం `RRR` ట్రెమండస్ సక్సెస్ తో పాటు అవార్డులని కూడా తెచ్చిపెడుతుండటం ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని సొంతం చేసుకోవడంతో రాజమౌళి ఈ క్షణాలని ఎంజాయ్ చేస్తున్నాడు.

దర్శకుడిగా తనకు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ దక్కడమే కాకుండా హాలీవుడ్ దిగ్గజ దర్శకులు కూడా రాజమౌళిని ప్రత్యేకంగా కలిసి ప్రశంసలు కురిపించడంతో జక్కన్న ఆనందానికి హద్దే లేకుండా పోయిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా వుంటే `RRR` తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో భారీ పాన్ వరల్డ్ మూవీని తెరపైకి తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నారు.  

కొన్నేళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ని తనకు చేస్తున్నానని వెల్లడించడం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా సినిమా నిర్మానానికి దూరంగా వుంటూ వస్తున్న కె.ఎల్. నారాయణతో కలిసి మేము కూడా భాగస్వాములుగా వ్యవహరిస్తామంటూ బాలీవుడ్ కు చెందిన క్రేజీ ప్రొడక్షన్ కంపనీలు రాజమౌళి వెంటపడుతున్నాయట. కనీసం కో ప్రొడ్యూసర్స్ గా అయినా వ్యవహరిస్తామని చాలా మంది బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ జక్కన్నని అడుగుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.

కనీసం తమకు సినిమాలో వాటా ఇచ్చినా చాలు అని అంతకు మించి తాము ఏమీ ఆశించమని కూడా చెబుతున్నారట. అంతే కాకుండా ఈ మూవీతో వచ్చే పేరుని మాత్రమే తాము ఆశిస్తున్నామని రాజమౌళి వెంటపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రాజమౌళి ఎవరిని మహేష్ ప్రాజెక్ట్ కు సహ నిర్మాతగా ఎంచుకుంటారో..? లేక హాలీవుడ్ కంపనీనే ఆ వ్యవహారాలు చూసుకోమంటారో వేచి చూడాల్సిందే అనే చర్చ నడుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.