Begin typing your search above and press return to search.

వీడియో : బాలీవుడ్‌ బాహుబలి అంచనాలు మరింత పైపైకి..!

By:  Tupaki Desk   |   12 May 2022 9:42 AM GMT
వీడియో : బాలీవుడ్‌ బాహుబలి అంచనాలు మరింత పైపైకి..!
X
బాలీవుడ్ బాహుబలి సినిమా అంటూ ఉత్తరాది మీడియా గత కొన్నాళ్లుగా విపరీతంగా ప్రచారం చేస్తున్న చిత్రం పృధ్వీరాజ్. బాలీవుడ్‌ సినిమాలు కేవలం హిందీలో మాత్రమే విడుదల అవుతూ ఉంటారు. కాని ఈ సినిమాను సౌత్‌ లోని అన్ని భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో జూన్ 3వ తారీకున విడుదల కాబోతున్న సినిమా నుండి హరి హర వీడియో సాంగ్‌ ను విడుదల చేశారు.

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ సమర్పణలో చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో ఆదిత్య ఛోప్రా నిర్మించిన ఈ సినిమా పై అంచనాలు పెంచే విధంగా హరి హర సాంగ్‌ ఉంది. తెలుగు వర్షన్‌ ను యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. ఇప్పటికే హిందీలో ఈ పాటకు అద్బుతమైన రెస్పాన్స్ రావడంతో తెలుగు లో కూడా ఆసక్తి వ్యక్తం అయ్యింది. సినిమా కు మంచి ప్రశంసలు దక్కే విధంగా పాట ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అక్షయ్ కుమార్ ఈ సినిమాలో పృధ్వీరాజ్ పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ యుద్ద సన్నివేశాలు మరియు భారీ స్టార్‌ కాస్టింగ్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈమద్య కాలంలో అక్షయ్‌ కుమార్‌ నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ అన్నట్లుగా వసూళ్లను సాధిస్తుంది. అందుకే ఈ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పృధ్వీరాజ్ సినిమా విజువల్స్ చూస్తూ ఉంటే మరో విజువల్ వండర్‌ ఇండియన్‌ సినీ ప్రేమికుల కోసం వచ్చింది అన్నట్లుగా ఉంది. బాహుబలి తర్వాత ఆ స్థాయి కన్నుల విందు అయిన భారీ వీఎఫ్‌ఎక్స్ మూవీ కాని.. పౌరాణిక మూవీ కాని వచ్చిందే లేదు. ఈ సినిమా ఆ లోటును తీర్చుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది.

తెలుగు లో ఈ సినిమా కు ఇప్పటి వరకు అగ్రెసివ్ గా ప్రమోషన్ చేయడం లేదు. కాస్త హైప్‌ వచ్చేలా ప్రమోట్‌ చేస్తే తప్పకుండా ఇక్కడ పృధ్వీ రాజ్ ను జనాలు ఆదరించే అవకాశం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ బాహుబలి అనే పేరు దక్కించుకున్న పృధ్వీ రాజ్‌ ఆ పేరును నిలుపుకుంటాడా అనేది చూడాలి.