థియేట్రికల్ రిలీజ్ అయిన 2 వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్

Fri May 13 2022 13:00:48 GMT+0530 (IST)

bhala thandanana movie on OTT

యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన భళా తందనాన ఇటీవలే మే 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూవర్స్ సినిమా లో శ్రీవిష్ణు నటనకు పాజిటివ్ మార్కులు ఇచ్చారు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మించాడు.శ్రీవిష్ణు.. కేథరిన్ థెర్సా జంటగా తెరకెక్కి ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యింది. సర్కారు వారి పాట సినిమా విడుదల తర్వాత థియేటర్లలో ఈ సినిమా కు కలెక్షన్స్ తగ్గాయి. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం చేశారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు గాను అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

సాదారణంగా అయితే సినిమాను నాలుగు వారాలు లేదా 50 రోజులు పూర్తి అయిన తర్వాత ఈమద్య కాలంలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కాని ఈ సినిమా కలెక్షన్స్ క్లోజ్ అయ్యాయి కనుక కాస్త ముందుగానే అంటే రెండు వారాల్లోనే సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అయ్యారు. మే 20వ తారీకున ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా డేట్ తో సహా ప్రకటించారు.

మే 6వ తారీకున వచ్చిన ఈ సినిమా సరిగ్గా రెండు వారాల తర్వాత అంటే మే 20న స్ట్రీమింగ్ కు సిద్దం చేశారు. సినిమా విడుదల సమయంలో చేసిన ప్రమోషన్ కార్యక్రమాల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. కనుక ఓటీటీ లో ఈ సినిమాను వెంటనే విడుదల చేయడం వల్ల ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈమద్య కాలంలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాలను మరియు చిన్న సినిమాలను ఓటీటీ ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. తెలుగు లో అత్యధిక సబ్ స్క్రైబర్స్ ను కలిగి ఉన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతున్న కారణంగా ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయి. నటుడిగా ఇప్పటికే పలు సార్లు పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న శ్రీ విష్ణు కథల ఎంపిక విషయంలో కొత్తదనం చూపిస్తూ ఉంటాడు. అందుకే భళాతందనాన సినిమా పై జనాల్లో ఆసక్తి ఉంది.