Begin typing your search above and press return to search.

ఆడియ‌న్స్ కు 'క్రాక్' లేపనున్న బాల‌య్య‌..!

By:  Tupaki Desk   |   7 March 2021 11:30 AM GMT
ఆడియ‌న్స్ కు క్రాక్ లేపనున్న బాల‌య్య‌..!
X
గోపీచంద్ మ‌లినేని మంచి జోరుమీదున్నాడు. "క్రాక్" వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో ర‌వితేజ‌ను హిట్ ట్రాక్ ఎక్కించిన ఈ ద‌ర్శ‌కుడు.. త్వ‌ర‌లో బాల‌య్య‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ప్ర‌చారం వాస్త‌వ‌మే అని స‌మాచారం. ఇప్ప‌టికే బాల‌కృష్ణ‌కు గోపీచంద్‌ ఓ క‌థ కూడా వినిపించాడ‌ని టాక్‌.

"క్రాక్" ముందు వ‌ర‌కు గోపీచంద్ కెరీర్ సాదాసీదాగానే సాగింది. కానీ.. ఆఫ్ట‌ర్ క్రాక్ ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి పిలిచి మ‌రీ అభినందించారు. అంతేకాదు.. ఓ సినిమా చేస్తాన‌ని మాట‌కూడా ఇచ్చాడ‌నే ప్ర‌చారం సాగింది. ఇప్పుడు బాల‌య్య‌తో సినిమా ఓకే అయ్యే ఛాన్స్ క‌నిపిస్తోంది. గోపీ వినిపించిన క‌థ‌ బాల‌య్య న‌చ్చింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌.

ప‌ల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చ‌రిత్ర‌కారుడి స్టోరీ ఆధారంగా క‌థ సిద్ధం చేశాడట‌ గోపీచంద్. ఇది బాల‌య్య‌కు వినిపించాడ‌ని, ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. అంతేకాదు.. స‌మ్మ‌ర్ తర్వా‌త సెట్స్ మీద‌కు కూడా వెళ్తుంద‌ని అంటున్నారు. మ‌రి, ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉంద‌నేది తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సిందే.

ఈ సినిమా ఓకే అయితే మాత్రం.. ద‌ర్శ‌కుడు గోపీ కెరీర్ మ‌రో మ‌లుపు తిరిగిన‌ట్టే. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా కాలం అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద హీరోల‌తో సినిమా చేయ‌లేక‌పోయాడు గోపీ. ఈ క‌థ ఓకే అయ్యి, హిట్ కొడితే మాత్రం.. చిరంజీవితోనూ సినిమా కార్య‌రూపం దాల్చొచ్చు. మ‌రి, ఏం జ‌రుగుతుంది అన్న‌ది చూడాలి.