బాలయ్య పవన్ రంగంలోకి దిగుతున్నారా?

Sun Aug 14 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

balakrishna and pawan kalyan movie news

టాలీవుడ్ క్రైసిస్ లో వుందని పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ లు టికెట్ ప్రైస్ సినిమా బడ్జెట్ వంటి పలు అంశాల కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారంటూ యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్ ల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ భిన్న స్వరం వినిపించినా చివరికి బంద్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించడంతో ఆగస్టు 1 నుంచి నిరవధికంగా సినిమా షూటింగ్ ల బంద్ జరుగుతోంది.అయితే ఈ బంద్ కరెక్ట్ గా లేదని కొంత మంది నిర్మాతలు గిల్డ్ పై ధిక్కార స్వరం వినిపిస్తూనే వున్నారు. ఇందులో కొంత మంది షూటింగ్ లు ఆపేది లేదని ఖరాకండిగా చెప్పేస్తున్నారు కూడా. ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా షూటింగ్ లు ఆగిపోవడంతో బాలయ్య గిల్డ్ పై గుర్రుగా వున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఆయనకు తోడుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా చేరుతున్నారని తెలుస్తోంది. విషయం ఏంటంటే ఆగస్టు 24 నుంచి తమకు సంబంధించిన సినిమాల షూటింగ్ లని యధవిధిగా ప్రారంభించాలని బాలకృష్ణ పవన్ కల్యాణ్ నిర్మాతలకు సూచించారట.

ఇదే ఇప్పడు గిల్డ్ ప్రొడ్యూసర్లకు ఇబ్బంది కరంగా మారే అవకాశం వుందని తెలుస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్ లో పవన్ కల్యాణ్ ఏపీ వ్యాప్తంగా బస్ యాత్రకు వెళ్లబోతున్నారు.

ఆ లోపు తను నటిస్తున్న `హరి హర వీరమల్లు` షూటింగ్ ని పూర్తి చేయాలనుకుంటున్నారట. ఇందు కోసం ఇప్పటికే నిర్మాతకు విషయాన్ని వివరించారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే తరహాలో నందమూరి బాలకృష్ణ కూడా తను గోపీచంద్ మలినేనితో చేస్తున్న 107 ప్రాజెక్ట్ ని పూర్తి చేసి వచ్చే ఎన్నికల కోసం సిద్ధంగా వుండాలని ప్లాన్ చేసుకుంటున్నారట.

అయితే షూటింగ్ ల బంద్ శనివారం తో 13 రోజులకు చేరడంతో 24 నుంచి ఈ ఇద్దరు హీరోలు బాలయ్య పవన్ తమ సినిమాల షూటింగ్ ల కోసం సెట్ లోకి అడుగుపెట్టబోతున్నారట. ఈ నేపథ్యంలో గిల్డ్ ఎలా వ్యవహరించబోతోంది? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఒక వేళ షూటింగ్ లు ఆపాల్సిందే అని గిల్డ్ చెబితే ఈ ఇద్దరు హీరోలు వింటారా? అంటే వినరుగాక వినరు అన్నది వారికీ తెలుసు. ఈ నేపథ్యంలో యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? .. ఎలా రియాక్ట్ కానున్నారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

స్టార్ హీరోలు ప్రొడ్యూసర్స్ కోసం షూటింగ్ లు ఆపే ప్రసక్తిలేదు.. ఆపితే షెడ్యూల్ మారుతుంది. లెక్కలూ మారతాయి. పంతానికి పోయి నిర్మాతల ద్వారానే ఆపిస్తే .. హీరోలు రంగంలోకి దిగుతారు.. తమ షెడ్యూల్ ని మార్చమంటారా? అంటూ ఫైర్ అయితే జరిగేది దబిడి దిబిడే.. అని ఓ వర్గం వాదిస్తోంది. ఏం జరగనుందన్నది తెలియాలంటే ఈ నెల 24 వరకు వేచి చూడాల్సిందే.