Begin typing your search above and press return to search.

కాంస్య సుంద‌రి మ‌త్తెక్కిస్తోంది

By:  Tupaki Desk   |   20 Feb 2020 4:05 AM GMT
కాంస్య సుంద‌రి మ‌త్తెక్కిస్తోంది
X
గ‌త కొంత‌కాలంగా అనుష్క శ‌ర్మ కెరీర్ జీరో అయిపోయింద‌నే చెప్పాలి. షారూక్ తో జీరో త‌ర్వాత సినిమాలే చేయ‌లేదేమిటో. విరాట్ ని పెళ్లాడాక ఈ అమ్మ‌డు విదేశీ టూర్ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తుండ‌డంతో సినిమాలు త‌గ్గించింది. అయితే సొంత నిర్మాణ సంస్థ‌లో ప‌లు సినిమాలు వెబ్ సిరీస్ లు నిర్మించే ప్లాన్ లో ఉందీ భామ‌.

ఈలోగానే ఇదిగో ఇలా డ‌బు ర‌త్నానీ క్యాలెండ‌ర్ గాళ్ గా మారిపోయింది. అనుష్క తాజా లుక్ ఫ్యాన్స్ లోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఈ దుస్తుల్లో కాంస్య సుంద‌రిలాగా త‌ళ‌త‌ళా మెరిసిపోతోంది. ప‌ర్ఫెక్ట్ పిక్చ‌ర్ ని డిజైన్ చేయ‌డంలో డబు ర‌త్నానీ స్కిల్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అనుష్క‌ను మునుప‌టి కంటే ఎంతో హాట్ గానూ ఈ ఫోటోలో ఆవిష్క‌రించాడు. ఇప్ప‌టికే డ‌బుర‌త్నానీ క్యాలెండ‌ర్ నుంచి ప‌లువురి ఫోటోలు రిలీజైన సంగ‌తి తెలిసిందే. వీటిలో అనుష్క శ‌ర్మ లుక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

కియారా అద్వానీ.. పూజా హెగ్డే.. స‌హా న‌వ‌త‌రం నాయిక‌లు దూసుకెళ్లిపోతుంటే ఎందుక‌నో అనుష్క శ‌ర్మ మాత్రం వెన‌క‌బ‌డిపోయింది. పెళ్ల‌యితే ఇంతేనా? అనుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే పెళ్ల‌యినా దీపిక మాత్రం ఇంకా ఇంకా స్పీడ్ పెంచేస్తోంది. తెలుగు న‌టి స‌మంత సైతం పెళ్లయ్యాకే స్పీడ్ మ‌రింత పెంచేసింది. అనుష్క శ‌ర్మ మాత్రం అందుకు అతీతంగా క‌నిపిస్తోంది. ఇక‌పై ఏదైనా గుడ్ న్యూస్ చెప్పేందుకే వెయిట్ చేస్తోందేమో!