రాజమౌళిని చూసి ఎమోషనల్ అయిన హీరోయిన్!

Sat Aug 13 2022 18:28:51 GMT+0530 (India Standard Time)

anupama taking rajamouli blessing

యంగ్ హీరో నిఖిల్ నటించిన సూపర్ నేచురల్ మిస్టిక్ థ్రిల్లర్ `కార్తికేయ 2`. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లపై అభఢిషేక్ అగర్వాల్ టీజీ విశ్వప్రసాద్ ఈ భారీ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీకృష్ణుడి రహస్యాల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. రిలీజ్ కుముందే టీజర్ ట్రైలర్ తో పాన్ ఇండియా వైడ్ గా బజ్ క్రియేట్ అయిన ఈ మూవీ ఎట్టకేలకు ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది.రెండు దఫాలుగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ మూవీని ఫైనల్ గా ఆగస్టు 13న శనివారం థియేటర్లలోకి విడుదల చేశారు. 2014లో వచ్చిన `కార్తికేయ`కు సీక్వెల్ గా రూపొందిన మూవీ ఇది.

దీంతో సహజంటగానే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఊహించినట్టుగానే ఈ మూవీ మంచి టాక్ తో ప్రేక్షకుల ప్రశంసల్ని మొదటి షోకే సొంతం చేసుకుని హిట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియన్స్ రెస్పాన్స్ చూడాలని చిత్ర బృందం థియేటర్లకు వెళ్లింది.

అక్కడ ప్రేక్షకుల స్పందన చూసి హీరో నిఖిల్ డైరెక్టర్ ఎమోషనల్ అయ్యారు. ఇద్దరు ఆత్మీయంగా కౌగిలించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని ప్రత్యేకంగా వీక్షించిన దర్శకుడు రాజమౌళి ఆయన సోదరుడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి షో పూర్తయిపోగానే పార్కింగ్ ప్లేస్ లోకి హెవీ క్రౌడ్ మధ్య వచ్చారు.

ఇక్కడే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అదే సమయానికి అక్కడికి చేరుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

దర్శకుడు రాజమౌళిని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిన అనుమ పరమేశ్వరన్ ఆయన కాళ్లకు నమస్కరించడం విశేషం. ఈ హఠాత్పరిణామానికి రాజమౌళితో పాటు కీరవాణి కూడా షాక్ అయినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి .. అనుపను అభినందించారట. ముగ్ధ పాత్రలో బాగా చేశావని సినిమా బాగా నచ్చిందని ప్రశంసలు కురిపించారట.For Video : https://youtube.com/shorts/8SEFH-YqKZo?feature=share