నాకు కరోనా రాలేదు బాబోయ్ అంటున్న సీనియర్ హీరో

Sat Dec 05 2020 11:59:27 GMT+0530 (IST)

anil kapoor tested corona negative

బాలీవుడ్ మూవీ 'జగ్ జగ్ జీయో' చండీగడ్ లో చిత్రీకరణ జరుపుతుండగా హీరో వరుణ్ ధావన్.. దర్శకుడు రాజ్ మెహత మరియు నీతూ కపూర్ లకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. వారితో పాటు సీనియర్ స్టార్ నటుడు అనీల్ కపూర్ కూడా కరోనా బారిన పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. అనీల్ కపూర్ కరోనా అంటూ వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు ఈమద్య వరుసగా కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో అనీల్ కపూర్ ఆరోగ్యం విషయమై అంతా కూడా టెన్షన్ పడ్డారు.మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టేందుకు అనీల్ కపూర్ తాను చేయించుకున్న కరోనా నిర్థారణ రిపోర్ట్ ను షేర్ చేశాడు. అందులో అనీల్ కపూర్ కు కరోనా నెగటివ్ అంటూ ఉంది. దాంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. నెగటివ్ వచ్చినా కూడా అనీల్ కపూర్ స్వీయ నిర్భందంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ కియారా అద్వానీకి కూడా కరోనా అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆమెకు కరోనా నెగటివ్ వచ్చినట్లుగా క్లారిటీ వచ్చింది. హీరో దర్శకుడు మరియు నీతా కపూర్ లకు మాత్రమే పాజిటివ్ అంటూ తెలుస్తోంది. వారికి కూడా పెద్దగా లక్షణాలు లేవు. అందువల్ల ఎలాంటి ఆందోళన అక్కర్లేదు అంటున్నారు.