Begin typing your search above and press return to search.

అన్న కోసం మరోసారి ఫ్యాన్స్ ముందుకు ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   2 Feb 2023 9:51 PM GMT
అన్న కోసం మరోసారి ఫ్యాన్స్ ముందుకు ఎన్టీఆర్‌
X
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ గత చిత్రం బింబిసార భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన తాజా చిత్రం 'అమిగోస్‌' పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అంటూ చాలా నమ్మకంగా కళ్యాణ్ రామ్‌ సినిమా గురించి మాట్లాడుతున్నాడు.

బింబిసార సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్‌ సందడి చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ బింబిసార కచ్చితంగా భారీ విజయాన్ని నమోదు చేస్తుంది అంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే బింబిసార మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈనెల 10వ తారీకున విడుదల కాబోతున్న అమిగోస్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ఈనెల 5వ తారీకున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి అన్నయ్య కళ్యాణ్ రామ్‌ కోసం ఎన్టీఆర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే కళ్యాణ్ రామ్‌ మరియు ఎన్టీఆర్ లు కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరు కి వెళ్లి నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ను పరామర్శించిన విషయం తెల్సిందే. ఒకరికి తోడు ఒకరు అన్నట్లుగా ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్ రామ్‌ లు ఉంటున్నారు. అలాగే ఎన్టీఆర్‌ 30 సినిమా నిర్మాణంలో కళ్యాణ్ రామ్‌ భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే.

ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధంతో మరోసారి ప్రీ రిలీజ్ వేడుక నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్‌ ముందుకు ఎన్టీఆర్‌ రాబోతున్నాడు. బింబిసార సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ఎన్టీఆర్‌ హాజరు అవ్వడంతో ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి అమిగోస్ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ పాల్గొని కళ్యాణ్‌ రామ్‌ హిట్‌ ని అందుకుంటాడేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.