లిప్ లాక్ సీన్లు రాస్తే దర్శకరచయితలకు కండీషన్

Sat Mar 06 2021 18:00:01 GMT+0530 (IST)

amala paul Talking About lip lock scenes

`ఆమె` చిత్రంలో నగ్నంగా నటించి సంచలనాలు సృష్టించింది అమలాపాల్. ఆడై పేరుతో ఈ సినిమా తమిళంలోనూ పెద్ద విజయం సాధించింది. ఇక ఇందులో గట్సీ పెర్ఫామెన్స్ తో మెప్పించడమే గాక.. క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఇంతకుముందే అమలాపాల్ గ్లామరస్ పాత్రలతో మెప్పించిన నాయిక.ఇటీవలే పిట్టకథలు వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమలాపాల్. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకురాలు నందినిరెడ్డి తెరకెక్కించిన ఎపిసోడ్ లో అమలాపాల్ బోల్డ్ పాత్రలో నటించింది. పిట్ట కథలులో గృహిణి మీరాగా కనిపించింది. దుష్ఠ భర్తపై స్మార్ట్ ట్రిక్స్ తో ప్రతీకారం తీర్చుకునే గృహిణిగా సర్ ప్రైజ్ చేసింది. అమలా పాల్ డేరింగ్ సెలెక్షన్ కి మరోసారి ప్రశంసలు కురిసాయి.

ఇక నేటితరం ఆసక్తుల గురించి అమలాపాల్ మాట్లాడుతూ..కొత్త-యుగం కంటెంట్ పై తన సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేసారు. ``సినీ ప్రేక్షకులు అభివృద్ధి చెందుతున్నారు. వారి ఆసక్తులను అర్థం చేసుకుని వినోదాన్ని అందించేటప్పుడు విలువను పెంచే కంటెంట్ కోసం వెతుకుతున్నారు`` అని వెల్లడించింది.

అంతేకాదు .. ఇకపై అమలాపాల్ లిప్ లాక్ లకు సిద్ధమేనని కూడా తెలుస్తోంది. పిట్టకథలు తనని మరింత బోల్డ్ గా ఎలివేట్ చేయడంతో ఇకపైనా వెబ్ సినిమాలు సిరీస్ లలో లిప్ లాక్ లకు అభ్యంతరం లేదని వెల్లడించింది. మునుముందు గ్లోబల్ ఆడియెన్ కి చేరువయ్యేలా మరింతగా చెలరేగేందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవట. సినిమాలు వెబ్ సిరీస్ లు ఏవైనా తన పాత్రలో సంథింగ్ ఏదైనా కొత్తదనం కావాలని దర్శకరచయితలను కోరుతోందట.