Begin typing your search above and press return to search.

ఖైదీ రీమేక్.. ఇంతలా మార్చేస్తే ఎలా బాసు?

By:  Tupaki Desk   |   25 Jan 2023 11:00 AM GMT
ఖైదీ రీమేక్.. ఇంతలా మార్చేస్తే ఎలా బాసు?
X
సాధారణంగా ఒక భాషలో సూపర్ హిట్ గా నిల్చిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సౌత్ లో సూపర్ హిట్ కాసిన నిలిచిన సినిమాలను నార్త్ లో రీమేక్ చేస్తున్నారు. కొందరు ఇక్కడ దర్శకులను అక్కడికి తీసుకు వెళ్లి మరీ కొందరు రీమేక్ చేయిస్తుంటే మరికొందరు మాత్రం నార్త్ దర్శకులు చేత అక్కడికి రీమేక్ చేయించుకుంటున్నారు. వాస్తవానికి కొన్ని సందర్భాలలో అలాంటి రీమేక్ సినిమాలు చేస్తున్నప్పుడు ఒరిజినల్ ఫ్లేవర్ అంట కూడదు అనే ఉద్దేశంతో అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటారు రీమేక్ దర్శకులు. ఇప్పుడు అలాంటి ప్రయోగమే ఒకటి జరిగిందనే ప్రచారం జరుగుతుంది.

అజయ్ దేవగన్ హీరోగా భోళా అనే సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన ఖైదీ అనే సినిమాకి ఈ సినిమా రీమేక్. కార్తి హీరోగా నటించిన ఖైదీ సినిమాకి సంబంధించి కార్తి నటించిన పాత్రలోనే ఇప్పుడు అజయ్ దేవగన్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండవ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో కార్తి కనిపించిన విధంగానే అజయ్ దేవగన్ కూడా ఒక రకమైన మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు కానీ కార్తి లో కనిపించిన పూర్తి స్థాయి మాస్ లుక్ మాత్రం అజయ్ దేవగన్ లో కనిపించడం లేదు.

వాస్తవానికి నార్త్ ప్రేక్షకులు మెచ్చే విధంగా మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఇప్పటికే అజయ్ దేవగన్ దృశ్యం లాంటి సినిమాలను హిందీలో రీమేక్ చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు భోళా అదే కోవలో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు.

ఇక ఇప్పటికే దృశ్యం 2 సినిమాతో 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన అజయ్ దేవగన్ ఈ సినిమాతో కూడా అదే రేంజ్ లో వసూళ్లు రాబడతాడు అనే ప్రచారం జరుగుతోంది కానీ ఒరిజినల్ పూర్తిస్థాయిలో కాకుండా కాస్త రిచ్ గా తెరకెక్కిస్తూ ఉండడంతో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.