మిల్కీ అందాల వలకు చిక్కితే మటాషే

Sun Aug 14 2022 09:00:01 GMT+0530 (India Standard Time)

actress tamanna latest clicks goes viral on social media

మిల్కీవైట్ బ్యూటీ తమన్నా వరుస ఫోటోషూట్లు వెబ్ లో గుబులు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాల్లో ఇవి వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం మెల్ బోర్న్ ఫిలింఫెస్టివల్ లో షోస్టాపర్ గా హృదయాలను గెలుచుకుంటోంది. అక్కడ రెడ్ కార్పెట్ పై తమన్నా హొయలు అగ్గి రాజేస్తున్నాయి. ఇటీవల తమన్నా గ్రీన్ కలర్ శారీ డిజైనర్ టాప్ ధరించి ఎంతో ముగ్ధమనోహరంగా కనిపించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో భారతీయ నటి మెరుపులు సంథింగ్ స్పెషల్ అంటూ ప్రశంసలు కురిసాయి.ఇంతలోనే మరో కొత్త లుక్ తో ప్రత్యక్షమైంది. ఈసారి పింక్ కలర్ లాంగ్ లెహెంగా లో తమన్నా ఎంతో అందంగా కనిపించింది. కొత్తగా షేర్ చేసిన స్నాప్ లలో మిల్కీవైట్ బ్యూటీ బోల్డ్ గా కనిపిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. రెడ్ కార్పెట్ పై పింక్ సుందరి మైమరిపిస్తోందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.

తమన్నా భాటియా- తాప్సీ పన్ను అధికారికంగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ ను ఉత్సవాలను ప్రారంభించారు. 120కి పైగా చిత్రాల ప్రదర్శనతో పాటు .. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించనుండడం ఈ వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఫెస్టివల్ లో సౌత్- హిందీ ఫిల్మ్ డిబేట్ గురించి తమన్నాకు ప్రశ్న ఎదురైంది.

దానికి స్పందిస్తూ ``ఇలాంటి సంభాషణ భారతదేశానికి మాత్రమే ప్రత్యేకం. నేను విదేశాలకు వెళ్లినప్పుడు ఉత్తరాది వారు.. దక్షిణాది వారు అంటూ ఎవరూ పిలవలేదు. విదేశీయులు భారతీయ సినిమా అని మాత్రమే పిలుస్తారు. ఇక్కడ IFFM కూడా అలాంటిదే. ఇటీవల పాన్ ఇండియా చిత్రాలను చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు`` అని అన్నారు.

మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం తమన్నాను ఈ ఏడాది వెతుక్కుంటూ రావడం ఆసక్తికరం. తమన్నా నటించిన తాజా బాలీవుడ్ చిత్రం `బబ్లీ బౌన్సర్` త్వరలో విడుదల కానుంది. మధుర్ భండార్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.

ఇతర కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తమన్నా నటించిన F3 ఇటీవలే విడుదలై విజయం అందుకుంది.  మిల్కీ వైట్ బ్యూటీ తదుపరి చిరంజీవి భోలా శంకర్ లో కనిపించనుంది. బోలే చుడియాన్- ప్లాన్ ఎ ప్లాన్ బి- గుర్తుందా శీతాకాలం చిత్రాల్లోనూ నటిస్తోంది.