నటి ప్రత్యూష కేసు 'నిర్భయ' పరిధిలో?

Sun Dec 08 2019 12:31:46 GMT+0530 (IST)

actress pratyusha mohter waiting for justice since 17 years

తెలుగు నటి ప్రత్యూష హత్యాచారం కేసు 17 ఏళ్ల క్రితం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. న్యాయం కోసం ప్రత్యూష తల్లి సరోజిని దేవి కోర్టులు.. పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఆ అత్యాచారం వెనుక బడా బాబులు.. రాజకీయ నాయకుల కుమారులు ఉన్నారని ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది. ప్రత్యూషపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని.. తనకు న్యాయం కావాలంటూ ఎంతో రోధించారు. కానీ ఆనాడు ఏ పోలీస్.. ఏ న్యాయవ్యవస్థ కదిలి ముందుకు రాలేదు?  దిశ ఘటనకు ఇంతగా స్పందించినట్టు నాటి ప్రజానీకం ఎక్కడా స్పందించనేలేదు.అప్పట్లో ఇంతటి అవేర్ నెస్ జనాల్లో లేనేలేదు. అందుకే ప్రత్యూష విషయంలో సామాన్యుడు న్యాయం జరగలని ప్రశ్నించలేదు. ఏ మీడియా సంస్థ కూడా ఆహత్యను అంతగా హైలైట్ చేయలేదు. కేవలం బడా బాబుల ఇన్వాల్వ్ మెంట్ ఉందని భయపడి ఏ ఒక్కరూ మాట్లాడ లేదని నాడు పత్రికా కథనాలు వేడెక్కించినా దానికి కూడా దిక్కు లేదు.

అయితే ఇప్పుడు ప్రజల్లో ఉన్నంత చైతన్యం అప్పుడు లేదన్నది నిజం. కానీ మీడియాకి కూడా చైతన్యం లేదా? అంటే ధనదాహంతో నిజాల్ని కప్పిపుచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా గతం. కానీ ప్రత్యూష ఆత్మకు శాంతి చేకూరలేదన్ని మాత్రం వాస్తవం. అయితే ఇటీవల దిశ ఘటనలో నిందితుల్ని నలుగురిని ఎన్ కౌంటర్ చేసిన కారణంగా ప్రత్యూష తల్లి సరోజిని ఈ కేసును నిర్భయ చట్టం లో చేర్చి  సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. హత్యాచారన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి నాడు కేసును మూసేసారని వాపోయారు. ఇప్పటి పోలీసులకు-ప్రభుత్వానికి ఇదే నా సవాల్ అంటూ సరోజిని నిలదీస్తున్నారు.

నిర్భయ చట్టంలో చేర్చి ప్రత్యూష కేసును రీ ఓపెన్ చేయగలరా? ? అంత దమ్ము - నిజాయితీ మీలో ఉంటే? న‌్యాయం చేయండి అంటూ సరోజిని సవాల్ విసిరారు. ఆమె ఆగ్రహం వెనక న్యాయం ఉంది అంటూ.. సోషల్ మీడియా వేదికగా మరింత మంది నిర్భయ బాధిత తల్లిదండ్రులు తమ గోను విన్న వించుకుంటున్నారు.  మరి వీటికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. పోలీసు బాస్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.