Begin typing your search above and press return to search.

బికినీ వేసుకోమంటే ఏడ్చేసిన అందాల నటి!

By:  Tupaki Desk   |   30 Jun 2022 3:30 AM GMT
బికినీ వేసుకోమంటే ఏడ్చేసిన అందాల నటి!
X
వెండితెరను ఏలేసిన అందాల కథానాయికల జాబితాలో జయప్రద పేరు అగ్రస్థానంలో కనిపిస్తుంది. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణనీయమైన రూపం .. విశాలమైన కళ్లు ఆమె సొంతం. 'భూమి కోసం' అనే తెలుగు సినిమాతోనే నటిగా ఆమె ప్రస్థానం మొదలైంది. కెరియర్ ఆరంభంలోనే 'అంతులేని కథ' .. 'సిరి సిరి మువ్వ' వంటి సూపర్ హిట్లను ఆమె అందుకున్నారు. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. మరాఠీ .. బెంగాలీ సినిమాల్లోనూ ఆమె జోరు కొనసాగింది.

ఏ భాషలో నటించినా జయప్రద వంటి అందాల కథానాయిక లేదనే అంతా అనుకున్నారు. అలాంటి కథానాయిక రాలేదనే ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. వెండితెరపై దశాబ్దాల పాటు వెలుగొందిన జయప్రదకి తన కెరియర్లో ఎన్నో సంఘటనలు .. మరెన్నో అనుభవాలు ఎదురై ఉంటాయి.

అలాంటివాటిని గురించి తాజా ఇంటర్వ్యూలో జయప్రద ప్రస్తావించారు ఆమె మాట్లాడుతూ .. " చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది .. నేను నా సినిమాలను చూసుకునేదానిని కాదు. ఇప్పుడంటే హీరోయిన్లు తమ సినిమాలను ఒకటికి రెండుసార్లు చూసుకుంటున్నారు. కానీ నాకు ఆ అలవాటు లేదు.

తెరపై ఆ పాత్రలో నేను ఎలా ఉన్నానో .. నా మేకప్ .. హెయిర్ స్టైల్ ఎలా ఉన్నాయో .. ఎలా చేశానో అనే ఒక భయం నాలో ఉండేది. అందువలన నేను నా సినిమాలను చూసుకునేదానిని కాదు. అది అమాయకత్వంతో కూడిన భయం అనుకోవచ్చునేమో. నేను దాసరి నారాయణ రావుగారి దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను.

ఆయన దర్శకత్వంలో 'దేవుడే దిగి వస్తే' సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఒక సీన్ కోసం నేను బికినీ వేసుకోవలసి వచ్చింది. నేను వేసుకోనని చెప్పి ఏడవడం మొదలు పెట్టాను. అదే విషయాన్ని దాసరి నారాయణగారికి చెప్పాను.

"ఇప్పుడు ఏమైందనీ .. నువ్వు వేసుకుని రా .. నేను చెబుతాను" అంటూ ఆయన అన్నారు. ఆ తరువాత నన్ను స్విమ్మింగ్ పూల్లో టైర్లో కూర్చోబెట్టి మరీ అభ్యంతరకరం కాకుండా ఆ సీన్ తీశారు. ఆ తరువాత ఆయన నాకు 'మేఘ సందేశం' వంటి మంచి సినిమాలు ఇచ్చారనుకోండి. అప్పటి నుంచి మాత్రం నేను బికినీ వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను .. అదే పద్ధతిని ఫాలో అవుతూ వచ్చాను. ఒకప్పుడు నా సినిమాలు చూసుకోని నాకు, ఇప్పుడు 'సాగర సంగమం' వంటి సినిమాల్లో నన్ను నేను చూసుకోవాలనిపిస్తోంది. 'జీవన జ్యోతి' వంటి సినిమాల్లో నటించాలనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు.