Begin typing your search above and press return to search.

షాపింగ్ మాల్ లో ఆయ‌న‌తో ఏంటీ వేషాలు శ్రీ‌యా?

By:  Tupaki Desk   |   28 Jan 2023 6:00 PM GMT
షాపింగ్ మాల్ లో ఆయ‌న‌తో ఏంటీ వేషాలు శ్రీ‌యా?
X
కొంటెగా ఒక య‌వ్వారం.. మ‌త్తుగా ఒక సింగారం..! ఆయ‌న స‌ర‌స‌న ఉంటే చాలు.. ఏమిటో కానీ ఈమ‌ధ్య శ్రీ‌య ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ లు సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టేస్తున్నాయ్! నిజానికి శ్రీ‌య న‌టించిన సినిమాలేవీ ఇంత‌గా హిట్లు కొట్ట లేదు కానీ.. హ‌బ్బీ ఆండ్రూ కోశ్చీవ్ తో రొమాంటిక్ ఫోజులు ప‌బ్లిక్ లో స‌రిగ‌మ‌లు బంప‌ర్ హిట్లు ధ‌మాకా హిట్లు కొడుతున్నాయ్.

ఇదిగో ఇలా షాపింగ్ మాల్ లో రొమాంటిగ్గా ఇచ్చిన ఫోజ్ అలా వెబ్ లో వైర‌ల్ గా దూసుకెళ్లిపోయింది. శ్రీ‌య ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్ అయిపోయిందంటే న‌మ్మండి. జీవితంలో ప్ర‌తి సెక‌నూ ఆస్వాధించాల‌ని కొంద‌రు చెబుతుంటారు. అలా ఆస్వాధించే ఆ కొంద‌రిలో తానున్నాన‌ని శ్రీ‌య చెప్ప‌క‌నే చెబుతుంది. అయితే ఈసారి ఈ ఫోజ్ త‌న హ‌బ్బీతో కాదు. ఆయ‌న పేరు ర‌జ‌త్. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్. శ్రీ‌య‌కు స‌న్నిహిత మిత్రుడు. ర‌జ‌త్ అండ్ క‌పుల్ ఫ్యాష‌న్ బోటిక్ ప్ర‌చారంలో ఇలా శ్రీ‌య రొమాంటిక్ భంగిమ‌తో అభిమానుల‌ను టీజ్ చేసింది. బోటిక్ కి బోలెడంత ప్ర‌చారం.. ఆవిడ‌కు కూడా క‌లిసొచ్చే ఆర్భాటం. అయినా ప‌బ్లిక్ లో ఏంటి ఈ ఫోజులు శ్రీ‌యా? అంటూ అభిమానులు ఓవైపు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

ఇక ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే..అందాల‌ శ్రీ‌య తాను వ‌ల‌చిన స‌ఖుడిని కొంగున క‌ట్టేసుకుంది స‌రే..! కొన్నాళ్లు అథ్లెట్ ఆండ్రూతో విదేశాల్లోనే కాపురం పేరుతో ప్ర‌పంచ దేశాల్లో త‌న‌కు న‌చ్చిన చోట‌ల్లా విహార‌యాత్ర‌లు చేసింది. ఇప్పుడు ఆయ‌న్ని కొంగున క‌ట్టుకుని ఇండియాలో వాలిపోయింది. ముంబై కేంద్రంగా బోలెడ‌న్ని ప్ర‌యోగాలు చేస్తోంది.

ఇటు హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ అటు హిందీ ప‌రిశ్రమ త‌మిళంలో త‌న కాంటాక్టుల‌తో అలా అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ ప‌బ్బం గ‌డిపేస్తోంది. న‌టించ‌డానికి అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేదు. నేటి డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లో ప‌ని చేయాల‌న్న ఉత్సాహం ఉండాలే కానీ స్టార్ల‌కు అవ‌కాశాలే అవ‌కాశాలు. ఇదే అద‌నుగా శ్రీ‌య గేమ్ ప్లాన్ బాగానే వ‌ర్క‌వుట‌వుతోంది. అందుకే ఆ ఆనందం ఇలా ప్ర‌స్ఫుటంగా త‌న ముఖంలో క‌నిపిస్తోంది. వీనుల విందైన ప‌సందైన ఫోటోషూట్ల‌తో నిరంత‌రం అభిమానుల‌కు ఇలా హాయ్ చెబుతూనే ఉంది.

సంచ‌ల‌నాల ఆర్.ఆర్.ఆర్ లో క‌నిపించిన శ్రీ‌య దృశ్యం 2 తో మరో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో క‌బ్జా అనే భారీ చిత్రంలో న‌టిస్తోంది. ఇది భారీగా పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల కానుంది. మ‌రోవైపు మ్యూజిక్ స్కూల్ అంటూ ప్ర‌యోగాత్మ‌కంగా న‌టించిన సినిమా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే పాన్ ఇండియా కేట‌గిరీలో ఈ మూవీ కూడా విడుద‌ల కానుందిట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.