Begin typing your search above and press return to search.

అశోకవనం అమ్మాయి.. క్యూట్ గ్లామర్ ట్రీట్

By:  Tupaki Desk   |   19 Aug 2022 4:30 PM GMT
అశోకవనం అమ్మాయి.. క్యూట్ గ్లామర్ ట్రీట్
X
కొంతమంది హీరోయిన్స్ సినిమాలతో పెద్దగా సక్సెస్ అందుకోకపోయినప్పటికీ మాత్రం గ్లామర్ ప్రపంచంలో వారికంటూ ఒక స్పెషల్ స్టార్ హోదాను సంపాదించుకుంటున్నారు.

సినిమాలతో సక్సెస్ కాకపోతే ఏంటి సోషల్ మీడియా ద్వారా గ్లామర్ ట్రీట్ తో వారికంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచుతున్న వారిలో రుక్సర్‌ ధిల్లాన్‌ కూడా చేరింది.

విశ్వక్సేన్ నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ద్వారా ఈ బ్యూటీ పర్వాలేదు అనే విధంగా మంచి విజయాన్ని అయితే అందుకుంది. ఆ సినిమాలో అమ్మోడి పాత్రకు మంచి గుర్తింపు అయితే లభించింది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న ఫొటోలు నెటిజన్ల మతిపోగొట్టేసే విధంగా ఉన్నాయి. రుక్సర్‌ ధిల్లాన్‌ రీసెంట్ గా క్లివేజ్ అందాలతో వయ్యారంగా కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక అంతకుముందే ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో నటించుకున్నప్పటికీ కూడా పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేదు. 2017లో ఆకతాయి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రుక్సర్‌ ధిల్లాన్‌ ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అలాగే అల్లు శిరీష్ తో చేసిన ఏబిసిడి సినిమా కూడా మరో దెబ్బ కొట్టింది.

వరుసగా రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. ఇక తర్వాత బాలీవుడ్ లో మాత్రం ఒకటి రెండు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక తెలుగులో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేయాలని అనుకున్న ఈ బ్యూటీకి మొత్తానికి విశ్వక్ సేన్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అయితే వచ్చింది. ప్రస్తుతం కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలి అని మంచి కంటెంట్ ఉన్న కథల కోసం ఎదురుచూస్తోంది. ఇక ఈలోపు ఈ తరహా గ్లామర్ షో తో కూడా అమ్మడు జనాల్లో హాట్ టాపిక్ గా మారుతొంది