విలక్షణ నటుడి మంచితనం.. ఫ్యామిలీకి జేసీబీ గిఫ్ట్

Tue Sep 14 2021 10:01:36 GMT+0530 (IST)

actor prakash raj JCB gift to the family?

ఈమద్య కాలంలో ప్రముఖులు సేవా కార్యక్రమాల్లో ముందు ఉండటం చాలా ఆనందం కలిగించే విషయం. చాలా మంది ప్రముఖులు చాలా రకాలుగా అవసరాల్లో ఉన్నవారికి సాయంగా నిలుస్తున్నారు. టాలీవుడ్ విలన్ సోనూసూద్ కోట్ల రూపాయలను ఖర్చు చేసి కరోనా సమయంలో సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. ఎంతో మంది పిల్లల చదువు కోసం తనవంతు సాయం అందిస్తున్నాడు. ఇంకా ఎన్నో రకాలుగా సోనూసూద్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ కు చెందిన మహేష్ బాబు.. చిరంజీవి ఇతర పెద్ద స్టార్ హీరోలు చిన్న హీరోలు పలువురు కూడా తమకు తోచిన సాయంను ఇతరులకు చేయడం జరుగుతుంది. ఇదే సమయంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన ఛారిటీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటికే గ్రామాన్ని దత్తత తీసుకుని సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామం అభివృద్ది కోసం తనవంతు కృషిని అందిస్తున్నారు. ఆయన ఫౌండేషన్ కరోనా సమయంలో చాలా యాక్టివ్ గా పని చేసి అందరి యొక్క ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ తన యొక్క మంచితనంను ప్రదర్శించాడు. మైసూర్ శ్రీరంగపట్నంకు చెందిన ఒక ఫ్యామిలీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. వారు చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కుటుంబంలోని వ్యక్తికి జేసీబీ డ్రైవింగ్ రావడంతో అతడికి జేసీబీని బహుమానంగా అందించాడు. ఆ జేసీబీతో ఆ కుటుంబంకు ఉపాది లభిస్తుంది. వారి కుటుంబం ఇకపై ఆనందంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రకాష్ రాజ్ ఆ జేసీబీని బహుమానంగా ఇచ్చారని చెబుతున్నారు.

ఈ సందర్బంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఒక జీవితంలో వెలుగు నింపడం కోసం మనం సంపాదించిన దాంట్లో కొంత తిరిగి ఇస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ప్రకాష్ రాజ్ గతంలో కూడా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తాను సంపాదించే దాంట్లో కొంత మొత్తంను సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది చాలా మంచి పరిణామం. విలక్షణ నటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్ ఇలా మరోసారి తన మంచి తనంను రియల్ లైఫ్ లో కూడా చూపించి తన గొప్పతనంను చాటుకున్నాడు. తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు. ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించిన ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉంది అనే వార్తలు వస్తున్నాయి.