Begin typing your search above and press return to search.

కిక్‌ స్టార్‌ వ్యాఖ్యల చిచ్చు... బన్నీ, విజయ్‌ ఫ్యాన్స్‌ రచ్చ

By:  Tupaki Desk   |   27 Nov 2022 5:30 PM GMT
కిక్‌ స్టార్‌ వ్యాఖ్యల చిచ్చు... బన్నీ, విజయ్‌ ఫ్యాన్స్‌ రచ్చ
X
కిక్, రేసుగుర్రం సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు తెలుగు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య విభేదాలను సోషల్ మీడియా ద్వారా రాజేసినట్లు అయ్యింది.

ఆయన ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా బన్నీ మరియు విజయ్‌ లో కచ్చితంగా బెస్ట్ డాన్సర్ విజయ్ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ విషయాన్ని అల్లు అర్జున్ కూడా ఒప్పుకుంటాడని, విజయ్ డాన్స్ చేస్తుంటే చాలా నాచురల్ గా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేశాడు.

అల్లు అర్జున్ డాన్స్ చేయడానికి చాలా ప్రాక్టీస్ చేస్తారని.. ఒక్కొక్క పాట కోసం నెలల తరబడి కష్టపడి ఆయన బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడం కోసం కృషి చేస్తాడని ఇదే సందర్భంలో అన్నారు. అయినా కూడా తమ అభిమాన హీరో అల్లు అర్జున్ ని తక్కువ చేసి మాట్లాడినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ బన్నీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో విజయ్ ఫ్యాన్స్ మాత్రం నటుడు శ్యామ్ యొక్క వ్యాఖ్యలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అల్లు అర్జున్ కంటే కూడా తమ హీరో బెస్ట్ డాన్సర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి శ్యామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా ఇద్దరు స్టార్ హీరోల యొక్క అభిమానుల వద్ద మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. ఈ రచ్చ ముందు ముందు ఎక్కడికి దారి తీస్తుందో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.