మెగాస్టార్ పుట్టినరోజు కానుక లేనట్టేనా?

Fri Jul 17 2020 08:36:58 GMT+0530 (IST)

acharya first look will be out on this date

ప్రతిసారీ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వస్తోంది అంటే అభిమానుల్లో సందడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. రక్తదాన శిబిరాలు పక్షం రోజుల ముందు నుంచే మొదలవుతాయి. ఖైదీనంబర్ 150 చిత్రంతో మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్న వేళ పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న గుడులు గోపురాలు తిరిగి పూజలు పునస్కారాలు చేశారు. సైరా: నరసింహా రెడ్డి సమయంలోనూ ఇలాంటి ప్రచార సందడి చూశాం.కానీ చిరు నటిస్తున్న తాజా చిత్రం విషయంలో అలా జరిగేందుకు ఆస్కారం ఉందా? అంటే అస్సలు అలాంటిదేదీ కనిపించడం లేదు. ఫ్యాన్స్ రక్తదాన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగే వీలుంది. అంతకుమించి హడావుడి చేయడానికి ప్రస్తుత సన్నివేశం అనుకూలించదు. కొరటాల దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య (చిరు 152) చిత్రీకరణలో ఉంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయ్యాక మహమ్మారీ వల్ల బ్రేక్ పడింది. దాదాపు 40శాతం షూటింగ్ ని పూర్తి చేయగా పెండింగ్ షూట్ కోసం రెడీ అవుతున్నారు.

అయితే ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ ఏమైనా ఉంటుందా? అభిమానులకు కానుక ఉంటుందా? అంటే .. అందుకు స్పష్ఠత లేదు. అయితే పుట్టినరోజును పురస్కరించుకొని ఆచార్య ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ మతి చెడేలా మెగాస్టార్ పై అదిరిపోయే విజువల్ ట్రీట్  కి సంబంధించిన టీజర్ లాంచ్ చేస్తారట. ప్రస్తుతం కొరటాల దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ బర్త్ డే కి ఆర్.ఆర్.ఆర్ నుంచి కొమరం భీమ్ ఫస్ట్ లుక్ వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ భంగపడ్డారు. అలా కాకుండా కొరటాల మాత్రం తెలివిగా ముందస్తు ప్లాన్ చేస్తున్నారట. `ఆచార్య` మూవీలో కాజల్ కథానాయిక. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.