జాంబీల సినిమా హిట్ లిస్టులో చేరినట్లేనా..?

Tue Feb 23 2021 11:12:21 GMT+0530 (IST)

Zombie Reddy Movie Collections

'అ' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ''జాంబీ రెడ్డి''. ఇందులో దక్ష - ఆనంది హీరోయిన్లుగా నటించారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ తెలుగులో తొలి జాంబీ మూవీ కావడం.. ప్రచార చిత్రాలతో ఇదో కొత్త రకం జోనర్ అని ఆసక్తిని కలిగించడంతో మంచి కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ కలెక్షన్స్ ముగిసేసరికి సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకోవడమే కాకుండా హీరోగా తేజ సజ్జాను సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయ్యాడని చెప్పవచ్చు.'జాంబీ రెడ్డి' సినిమాకి వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మరియు అన్ని రైట్స్ మీద వచ్చే ఇన్ కమ్ కలుపుకొని ఈ సినిమా దాదాపుగా రూ.11.2 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నిర్మాతకి ఈ సినిమా మీద సుమారు రూ 1.2 కోట్లు లాభం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జాంబీ సినిమాను కూడా ఈ ఏడాది హిట్ లిస్ట్ లో ట్రేడ్ వర్గాలు చేర్చాయి. ఇకపోతే ఈ చిత్రానికి స‌్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందించగా.. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. సాయిబాబు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇందులో రఘుబాబు - పృథ్వీరాజ్ - జబర్దస్త్ శ్రీను - హేమంత్ - హరితేజ - అన్నపూర్ణమ్మ - కిరీటి - రమ రఘు ఇతర పాత్రలు పోషించారు.