Begin typing your search above and press return to search.

'ATM' లో జగన్ గా మాస్ లుక్ లో ఆకట్టుకున్న బిగ్ బాస్ విన్నర్..!

By:  Tupaki Desk   |   18 Aug 2022 3:50 AM GMT
ATM లో జగన్ గా మాస్ లుక్ లో ఆకట్టుకున్న బిగ్ బాస్ విన్నర్..!
X
ఓటీటీ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వేదికలలో ZEE5 ఒకటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషలలో వివిధ ఫార్మాట్‌ లలో నిర్విరామంగా కంటెంట్‌ ను అందిస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటుగా సరికొత్త వెబ్ సిరీస్ లతో వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు లేటెస్టుగా ''ATM'' అనే ఆసక్తికరమైన సిరీస్ తో రాబోతోంది.

'ఏటీఎమ్' వెబ్ సిరీస్ ను దిల్ రాజు నిర్మాణంలో శిరీష్ మరియు హరీష్ శంకర్ సమర్పణలో రూపొందిస్తున్నారు. ZEE5 సహకారంతో హర్షిత్ రెడ్డి - హన్షిత నిర్మించారు. హరీష్ శంకర్ ఈ సిరీస్ కు కథను అందించగా.. సి చంద్ర మోహన్ దర్శకత్వం వహించారు.

ఇది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరియు డైరెక్టర్ హరీశ్ శంకర్ లకు ఓటీటీ డెబ్యూ. ఇందులో VJ సన్నీ - సుబ్బరాజు - పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ATM ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగించింది. 'బిగ్ బాస్' తెలుగు సీజన్-5 టైటిల్ విజేత వీజే సన్నీ పుట్టినరోజు సందర్భంగా, అతని పాత్రను పరిచయం చేసే వీడియో గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు.

ఇందులో జగన్‌ అనే 26 ఏళ్ల వ్యక్తిగా.. ఒక కేసులో బుక్ అయిన దోపిడీ దొంగగా సన్నీ ని చూపించారు. అతని పాత్రలోని మాస్ + రగ్గడ్ + స్వాగ్ ను ఈ వీడియో ఆవిష్కరిస్తోంది. హైదరాబాద్‌ లోని స్లమ్స్ కు చెందిన నలుగురు యువకుల కథే ''ఏటీఎం'' అని తెలుస్తోంది.

జీవనోపాధి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసుకునేవారు.. ఒక రోజు భారీ దోపిడీ కేసులో ఇరుక్కుని, సమాజంలోని అనేక అంశాలకు మోస్ట్ వాంటెడ్ నిందితులుగా మారుతారు. ఆ నలుగురు దీన్నుంచి ఎలా విముక్తి పొందారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? వారి ప్రయాణం ఎలా సాగిందనేది ఈ హీస్ట్ కామెడీ సిరీస్ లో చూపించనున్నారు.

ఇటీవల కాలంలో జీ5 ఓటీటీలో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' 'లూజర్ 2', 'గాలివాన' 'రెక్కీ', 'మా నీళ్ల ట్యాంక్‌' 'పేపర్ రాకెట్' మరియు 'హలో వరల్డ్' వంటి వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ చేయబడ్డాయి. ఈ క్రమంలో ''ATM'' సిరీస్ కూడా రాబోతోంది. త్వరలోనే ఈ ఒరిజినల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.