మరో సినిమా కొనుగోలు చేసిన జీ

Sun Nov 22 2020 18:00:11 GMT+0530 (IST)

Zee who bought another movie

సౌత్ లో ఇప్పటి వరకు జీ5 ఓటీటీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎక్కువ తెలుగు సినిమాలు అమెజాన్.. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో జీ5 వారు తెలుగు సినమాలను వరుసగా కొనుగోలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఓటీటీ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ తో పాటు థియేట్రికల్ రైట్స్ ను కూడా వీరు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సోబెటర్' సినిమాను జీ5 కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాను మొదట డైరెక్ట్ ఓటీటీ విడుదల చేయాలనుకున్నా థియేటర్ల ప్రారంభంకు ఓకే చెప్పడంతో జీ5 వారే థియేట్రికల్ రిలీజ్ కు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో మరో సినిమాను జీ సంస్థ కొనుగోలు చేసిందనే వార్తలు వస్తున్నాయి.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'రాజ రాజ చోర' సినిమాను జీ5 వారు హోల్ సేల్ గా కొనుగోలు చేశారట. కరోనా లాక్ డౌన్ వల్ల ఆలస్యం అవుతున్న ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. హసిత్ గొలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.