Begin typing your search above and press return to search.

మెగా ప్యాకేజీ కోస‌మే వెళ్లారా బ్ర‌ద‌ర్?

By:  Tupaki Desk   |   15 Dec 2019 5:30 PM GMT
మెగా ప్యాకేజీ కోస‌మే వెళ్లారా బ్ర‌ద‌ర్?
X
ఈటీవీలో పాపుల‌ర్ రియాలిటీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌` నుంచి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు బ‌య‌ట‌ప‌డిన నాటి నుంచి యూట్యూబ్-మీడియా వేదిక‌లపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌ శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి నిర్మించిన‌ ఈ షో చాలా మందిని వెలుగులోకి తీసుకురావ‌డ‌మే కాకుండా చాలా మంది జీవితాల్ని స‌మూలంగా మార్చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు... పెద్ద అస్సెట్ అన్న క‌థ‌నాలు వ‌చ్చాయి. నాగ‌బాబు- న‌టి రోజా న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించి దీనిని పెద్ద స‌క్సెస్ చేశారు. అయితే ఇటీవ‌ల ఈ షో నుంచి ఆర్థిక లావాదేవీలు స‌హా పాల‌సీ ప‌రమైన‌ విభేదాల కార‌ణంగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌ప్పుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

అయితే ఈ షో నుంచి త‌ప్పుకున్న నాగ‌బాబు జీటీవీతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నార‌ట‌. జీ తెలుగు ఛాన‌ల్ కోసం ఆయ‌న జ‌బ‌ర్ద‌స్త్ త‌ర‌హా కామెడీ షోని ఈ మ‌ధ్య‌నే మొద‌లుపెట్టారు. ఇందుకు గాను జీటీవీ వాళ్ల‌నుంచి ప్ర‌తి నెలా 30 ల‌క్ష‌లు దాంతో పాటే అద‌నంగా ప్యాకేజీ ముడుతోంద‌ని తెలుస్తోంది. షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా కార‌వాన్‌.. సెల‌బ్రిటీ ట్రీట్ ని నాగ‌బాబు పొందుతున్నార‌న్న‌ది తాజా న్యూస్‌.

జ‌బ‌ర్ద‌స్త్ చేస్తున్న స‌మ‌యంలో మ‌ల్లెమాల టీమ్ నుంచి నెల‌కు 20 ల‌క్ష‌ల వ‌ర‌కూ నాగ‌బాబుకు అందేద‌ట‌. దానికి 10 ల‌క్ష‌లు అద‌నంగా క‌లుపుకుని 30లక్ష‌ల వ‌ర‌కూ జీటీవీ నుంచి వ‌స్తుండ‌టం వ‌ల్ల‌నే మెగా బ్ర‌ద‌ర్ షిఫ్ట్ అయ్యార‌ట‌. అంతేకాదు... ఇప్పుడున్న ప్యాకేజీ మొత్తాన్ని రెండేళ్ల‌కు ఒక‌సారి పెంచేందుకు జీ నుంచి కాంట్రాక్ట్ కుదుర్చుకున్న‌ట్టు కూడా వినిపిస్తోంది. అయితే ఇంత పెద్ద మెగా ప్యాకేజీ కోస‌మే వెళ్లారా బ్ర‌ద‌ర్? అంటూ కొన్ని కామెంట్లు సామాజిక మాధ్య‌మాల్లో వినిపిస్తున్నాయ్.