Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేమ్ లో సీఎం జ‌గ‌న్-బాల‌య్య‌-ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   15 July 2019 4:37 PM GMT
ఒకే ఫ్రేమ్ లో సీఎం జ‌గ‌న్-బాల‌య్య‌-ఎన్టీఆర్
X
ఒకే వేదిక‌పై ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌ను చూడ‌బోతున్నామా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఆ ఇద్ద‌రూ కొత్త సీఎం చేతుల మీదుగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ పుర‌స్కారాన్ని అందుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఇంత‌కీ ఆ సంద‌ర్భం ఎప్పుడు రానుంది? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

తెలంగాణ నుంచి విడిపోయి న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ ఏర్ప‌డిన త‌ర్వాత‌ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్ప‌ట్లో 2014- 2015- 2016 సంవత్సరాలకు నంది అవార్డుల విజేతలని ప్రకటించింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఆ పుర‌స్కారాల్ని గ్ర‌హీత‌ల‌కు అందించ‌లేదు. వాటి కోసం ఓ వేదిక‌ను ప్లాన్ చేయాల‌ని చంద్ర‌బాబు భావించినా అది కుద‌ర‌లేదు. ఇలా ఆల‌స్యం అవ్వ‌డంపై ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ప్ర‌భుత్వం మారింది. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచాక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఆయ‌న సార‌థ్యంలోనే పెండింగ్ లో ప‌డిన నంది పుర‌స్కారాల్ని అందించే ప్లాన్ జ‌రుగుతోంద‌ని తాజాగా రివీలైంది.

2014 ఏడాదికి ఉత్త‌మ న‌టుడిగా బాల‌య్య (లెజెండ్).. 2015 సంవ‌త్స‌రానికి ఉత్తమ న‌టుడిగా మ‌హేష్ (శ్రీ‌మంతుడు).. 2016 సంవ‌త్స‌రానికి ఉత్త‌మ న‌టుడిగా ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) పుర‌స్కారాల్ని అందుకోవాల్సి ఉంది. వీటిని కొత్త సీఎం అందిస్తార‌ని చెబుతున్నారు. అంటే ఒకే వేదిక‌పై సీఎం జ‌గ‌న్ తో పాటుగా బాల‌య్య‌-ఎన్టీఆర్- మ‌హేష్ ల‌ను అభిమానులు చూసుకునే వీలుంద‌న్న‌మాట‌.