Begin typing your search above and press return to search.

'మాస్ట్రో' ఫైనల్ షెడ్యూల్ షురూ చేసిన యూత్ స్టార్..!

By:  Tupaki Desk   |   14 Jun 2021 5:44 AM GMT
మాస్ట్రో ఫైనల్ షెడ్యూల్ షురూ చేసిన యూత్ స్టార్..!
X
యూత్ స్టార్ నితిన్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''మాస్ట్రో''. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న 'మాస్ట్రో'.. ఫైనల్ షెడ్యూల్ షూట్ ఈ రోజు సోమవారం హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో తిరిగి షూటింగ్ ప్రారంభించిన ఫస్ట్ స్టార్ హీరో సినిమా ఇదేనని చెప్పవచ్చు.

'మాస్ట్రో' తాజా షెడ్యూల్ లో నితిన్ మరియు తమన్నా భాటియా పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌ తో మొత్తం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ హిట్ 'అంధాదున్' తెలుగు రీమేక్. ఇప్పటికే నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయబడిన ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

నితిన్ కెరీర్ లో మైలురాయి 30వ సినిమాగా వస్తున్న ఈ క్రైమ్ కామెడీకి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. జె.యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఆర్.శేఖర్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న 'మాస్ట్రో' చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సీనియర్ న‌రేష్‌ - జిషుసేన్ గుప్తా - శ్రీ‌ముఖి - అన‌న్య‌ - హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ - ర‌చ్చ ర‌వి - మంగ్లీ - శ్రీ‌నివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ కెరీర్లోనే డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న 'మాస్ట్రో' యువ హీరోకి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.