Begin typing your search above and press return to search.

అమ్మాయి చేతిపై యంగ్ టైగ‌ర్ టాట్టూ

By:  Tupaki Desk   |   16 Sep 2021 5:35 AM GMT
అమ్మాయి చేతిపై యంగ్ టైగ‌ర్ టాట్టూ
X
సినిమా స్టార్ల‌ని అభిమానులు డెమీ గాడ్స్ గా భావించి వారికి త‌మ హృద‌యంలో ప్ర‌త్యేక స్థానాన్ని ఇస్తుంటారు. అంతే కాకుండా వారి కోసం ఏం చేయ‌డానికైనా.. వారి అభిమానాన్ని చాటుకోవ‌డానికి ఎలాంటి ప‌ని చేయ‌డానికైనా వెనుకాడ‌రు. త‌మ హీరోల‌ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం.. వారి దృష్టిని ఆక‌ర్షించ‌డానికి అభిమానులు చేసే వింత వింత ప‌నులు అనునిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటాయి. తాజాగా యంగ్ టైగ‌ర్ లేడీ అభిమాని ఓ వింత ప‌ని చేసి వార్త‌ల్లో నిలిచింది.

దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఒక అమ్మాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పోలి ఉండే శాశ్వత టాట్టూ వేసుకుంది. ఆ టాటూకు సంబంధించిన ఫొటోల‌తో పాటు వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఇది నెట్టింట వైర‌ల్ గా మారింది. ఒక అమ్మాయి ఎలా ఉండాలి లేదా ఉండకూడదు అనే దాని గురించి చాలా మంది నెట్టింట చ‌ర్చ మొద‌లుపెట్టారు. స‌ద‌రు లేడీ అభిమాని చేసిన త‌ల‌తిక్క ప‌నికి నెటిజ‌న్స్ ఆమెని ట్రోల్ చేయ‌డం వైర‌ల్ గా మారింది. అయితే ఈ సందర్భంగా స‌ద‌రు అభిమానిని బ‌లంగా స‌పోర్ట్ చేస్తున్న వారు కూడా వున్నారు. మ‌గ వారు టాటూ వేయించుకుంటే లేని త‌ప్పు ఓ మ‌హిళా అభిమాని త‌న అభిమాన హీరో పేరుని `యంగ్ టైగ‌ర్` సింబ‌ల్ ని టాట్టూగా వేయించుకుంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

కొంత మంది హీరోల అభిమానులు `ఈమెలా చేయాలి` అంటూ ఇత‌ర హీరోల అభిమానులు ఆమెని ఆద‌ర్శంగా తీసుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఇంత‌టి పిచ్చి అభిమానాన్ని ఆమె త‌ల్లిదండ్రులు ఎలా ప్రోత్స‌హించార‌ని కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా వాళ్లు కూడా వున్నారు. ఓవ‌రాల్ గా ఇక్క‌డో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. మ‌గ వారు మాత్ర‌మే త‌మ‌కు నచ్చిన హీరోపై అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని అత్య‌ధిక శాతం ఇండైరెక్ట్ గా వ్య‌క్తం చేశారు. అమ్మాయిల‌కు మాత్రం ఆ అవ‌కాశం లేద‌ని చెప్ప‌డంతో స‌ర్వ‌త్రా ఈ ఈక్వేష‌న్స్ పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి ఎన్టీఆర్ న‌టిస్తున్న ఈ మూవీ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ త‌రువాత త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ డైరెక్ష‌న్ లో చేయ‌బోతున్నారు. దీని త‌రువాత `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ తోనూ ఓ భారీ పాన్ ఇండియా స్థాయి మూవీ చేయ‌బోతున్నారు.