హీరోయిన్ల కు ఆఫర్లు ఇప్పిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

Sat Dec 07 2019 09:50:57 GMT+0530 (IST)

Young music director making offers for heroines

ఏదైనా సినిమాకి కథానాయిక ఎంపికలో దర్శకనిర్మాతలు లేదా హీరో ఇన్వాల్వ్ మెంటే కీలకం. కానీ ఆ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ సినిమాకి పని చేసినా.. ఆ ముగ్గురినీ డామినేట్ చేస్తూ కథానాయికల్ని సజెస్ట్ చేసేస్తున్నాడట.గత కొన్నాళ్లు గా రొటీన్ ట్యూన్స్ అంటూ విమర్శలు ఎదుర్కొన్న సదరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవల తన స్టైల్ మార్చుకుని కొత్త పంథా ట్యూన్లతో ఆకట్టుకుంటున్నాడు. కొన్ని బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ తో తెలుగులో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా అతడికంటూ ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ దృష్ట్యా తను పనిచేసే ప్రతి సినిమా కు ఏదో ఒక హీరోయిన్ ని సజెస్ట్ చేస్తున్నాడట. సహజంగానే సంగీత దర్శకులతో కథానాయికలు స్నేహంగా ఉండే యాటిట్యూడ్ కూడా ఇందుకు కారణమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నాయికలను సజెస్ట్ చేయడం వరకూ ఓకే కానీ.. వారితో పాటలు కూడా పాడించేస్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా మాంచి ఫామ్ లో ఉండడం.. ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల కు పోటీనిస్తుండడంతో అతడు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా ఉందట. ఇక అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సజెస్ట్ చేస్తే సీనియర్ డైరెక్టర్లు దానిని పెద్దంతగా పట్టించుకోరు కానీ.. కొందరు యంగ్ డైరెక్టర్లు అయితే మొహమాటానికి పోవాల్సి వస్తోందట. అందుకే.. సదరు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఎంతమంది భామల్ని సజెస్ట్ చేస్తాడో ఏమిటో అంటూ గుసగుస వేడెక్కిస్తోంది.