Begin typing your search above and press return to search.

'సిక్స్ ప్యాక్'తో థ్రిల్ చేస్తున్న యంగ్ హీరో..!!

By:  Tupaki Desk   |   10 July 2020 3:15 AM GMT
సిక్స్ ప్యాక్తో థ్రిల్ చేస్తున్న యంగ్ హీరో..!!
X
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కాలాన్ని గడుపుతున్నాడు. రీసెంట్ గా విడుదలైన 'అర్జున్ సురవరం' హిట్ అవ్వడంతో నిఖిల్ మంచి జోష్ లోకి వచ్చాడు. ఇక ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడైన నిఖిల్.. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ-2లో నటిస్తున్నాడు. ఇప్పుడా కార్తికేయ-2 సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే హీరో నిఖిల్ తన తదుపరి సినిమా గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కావడంతో నిఖిల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఓ పిక్ పోస్ట్ చేసాడు. ఫామ్ లోకి అంటే షూటింగులోకి కాదు.. వర్కౌట్స్ చేస్తూ మళ్లీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ ఫోటో చూస్తే ఈజీగా అర్ధమవుతుంది.

నిఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ రెడీ చేసినట్లు తెలుస్తుంది. మళ్లీ సిద్ధం అవుతున్న అంటూ నిఖిల్ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కెరీర్ మొదటి నుండి కాన్సెప్ట్ లతో కూడిన సినిమాలు చేస్తున్న నిఖిల్ తాజాగా '18 పేజీలు' సినిమాను ప్రారంభించాడు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజా కథనాల ప్రకారం.. ఈ సినిమా గురించి ఇంకో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఫస్ట్ టైం నిఖిల్ మతిమరుపు పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ మతిమరుపు కాన్సెప్ట్ పై చాలా చిత్రాలు వచ్చినా ఈ సినిమాలో ఇంకాస్త వెరైటీ ఉండబోతుంది అంటున్నారు చిత్రయూనిట్. చూడాలి మరి నిఖిల్ ఏ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీ చూపించబోతున్నాడో..!