యూఎస్ నుండి యూకే కి మారిన యంగ్ హీరో సినిమా..!

Mon Jul 04 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Young hero movie moved from US to UK

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు మొదలు అవుతాయి.. ఏవో కారణాల వల్ల షూటింగ్ మధ్యలో నిలిచి పోతాయి. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ఒక యంగ్ హీరో సినిమా షూటింగ్ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. హీరోగా ఇప్పుడిప్పుడే ఆయన కుదురుకుంటున్నాడు. మరో వైపు దర్శకుడిగా కూడా ఆయన భారీ కమర్షియల్ సక్సెస్ లను దక్కించుకోలేదు.వీరిద్దరి కాంబో సినిమా అంటే ఎంత తక్కువ బడ్జెట్ అయితే అంత మంచిది. కాని బడ్జెట్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ కొంత భాగం చేసిన తర్వాత ఆపేశారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రారంభం అయిన సినిమా ను ఆపేశారు. ఆ సమయంలో కొన్ని వీడియోలు పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఒక విభిన్నమైన టైటిల్ ను కూడా పెట్టి సినిమా ను ప్రమోట్ చేశారు

సినిమా మొదటి షెడ్యూల్ తర్వాత యూఎస్ లో షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. యూఎస్ షెడ్యూల్ లెక్కలు వేస్తే బడ్జెట్ భారీగా పెరిగి పోతుందట. దాంతో నిర్మాత నా వల్ల కాదు అన్నట్లుగా చేతులు ఎత్తేశాడట. దాంతో సదరు యంగ్ హీరో మరియు దర్శకుడు సినిమాను అటకెక్కించారు. ఎట్టకేలకు మళ్లీ సినిమాను రీ షెడ్యూల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

యూఎస్ షెడ్యూల్ కు భారీ బడ్జెట్ ఖర్చు అవుతుంది. కాని అదే షెడ్యూల్ ను యూకే లో ప్లాన్ చేస్తే బడ్జెట్ చాలా వరకు తగ్గుతుందట. అంతే కాకుండా డేట్లు కూడా చాలా వరకు తగ్గించి తీసుకోబోతున్నారట. తద్వారా బడ్జెట్ మొదట అనుకున్నట్లుగా వస్తుందట. అందుకే మళ్లీ ఆ సినిమా మొదలు అవ్వబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.

ఎప్పుడో ఏడాది క్రితం పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సిన ఆ సినిమా ఇప్పటికి అయినా పూర్తి అయితే ఈ ఏడాది చివరి వరకు అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది చూడాలి. ఆ యంగ్ హీరో ఈమద్య కాలంలో చేసిన సినిమాలేమి కమర్షియల్ హిట్ అవ్వలేదు. కనుక ఈ సినిమా పై ఆశలు పెట్టుకుని ఉన్నాడు.