ట్రైలర్: టబుతో నిండా మునిగిన యంగ్ బోయ్

Sun Jul 12 2020 10:00:00 GMT+0530 (IST)

Trailer: Young boy drowning with a tabu

పాత రోజుల్లో ముఖ్యంగా స్వాతంత్య్రానికి పూర్వం ఊరికో చింతామణి(వేశ్య కాని వేశ్య) ఉండేదని తనవద్దకు వెళ్లేందుకు యువకుల ఉడుకు నెత్తురు తహతహలాడేదనేది హిస్టరీ.  నాటి సంస్కృతి వేరు. పద్ధతులు వేరు. అప్పట్లో పెద్దలు ఏం చెబితే అదే. కానీ అలాంటి రోజుల్లో కూడా చింతామణి లాంటి ఆవిడ వద్దకు వెళుతుంటాడు ఆ కుర్రాడు(బోయ్). అతడిని తన తండ్రి గారు ఎంత మందలించినా ఆ పని మాత్రం ఆపడు. ఓవైపు అతడి అన్నకు పిల్లను వెతుకుతుంటారు ఇంట్లో. కానీ తమ్ముడు మాత్రం చింతామణి ని వదిలి ఉండలేడు. అది అందరికీ తలనొప్పిగా మారుతుంది.  ఈ కథ వినేందుకు ఎంతో రంజుగా ఉంది కదూ? సరిగ్గా ఇలాంటి కథతోనే బీబీసీ టీవీ సిరీస్ `ఏ సూటబుల్ బోయ్` వేడి పెంచేస్తోంది. ఇందులో చింతామణి పాత్రలో టబు నటిస్తే.. తనతో రొమాన్స్ చేసే యువకుడిగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ నటించాడు. ధడక్ తర్వాత ఇషాన్ ఓ ఆంగ్లో ఇండియన్ మూవీలో నటించాడు. ప్రస్తుతం ఏ సూటబుల్ బోయ్ అతడి ఇమేజ్ ని పెంచే సిరీస్ అన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన నిమిషం నిడివి ట్రైలర్ లో తనకంటే ఎంతో సీరియర్ అయిన టబుతో ఇషాన్ రొమాన్స్ వేడి పెంచేస్తోంది.

 విక్రమ్ సేథ్ రాసిన నవల ఆధారంగా మీరా నాయిర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ పర్ఫెక్ట్ టీవీ అడాప్టేషన్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.  1951 లో ఉత్తర భారతదేశంలో జరిగిన కథ ఇది. భారత దేశం మొదటి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో నాటి సామాజిక స్థితిగతుల్ని సంస్కృతిని ఎలివేట్ చేస్తూ తెరకెక్కించారు. 2006 క్లాసిక్ హిట్ `ది నేమ్ సేక్` తర్వాత మీరా- టబు కాంబినేషన్ లో వస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రంగానూ ప్రచారమవుతోంది. ఇందులో రామ్ కపూర్- తాన్య మణిక్తాలా- రసిక దుగల్ తదితరులు నటించారు.