యంగ్ టైగర్ - దళపతి విజయ్ మల్టీస్టారర్?!

Mon Apr 19 2021 08:00:02 GMT+0530 (IST)

Young Tiger and Dalapati Vijay Multistarrer

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దళపతి విజయ్ రేర్ కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయా? అంటే అవుననే కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకోసం స్టార్ డైరెక్టర్ అట్లీ బ్రిలియంట్ ప్లాన్ వేశాడని కథనాలొస్తున్నాయి. నిజానికి విజయ్ తో.. ఎన్టీఆర్ తోనూ సినిమాలు చేయాలని అట్లీ చాలా కాలంగా ప్రయత్నాల్లో ఉన్నాడు. వరుస బ్లాక్ బస్టర్లు ఇచ్చిన అట్లీకి విజయ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఎన్టీఆర్ తో అట్లీ సినిమా చేస్తే అది వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేయాల్సి ఉంది. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ చాలా ఆలస్యమవుతోంది.తాజా సమాచారం మేరకు హీరోల కాల్షీట్లు తనకు ఉన్నాయి కాబట్టి ఆ ఇద్దరినీ కలిపి మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన అట్లీకి ఉందిట. ఆ దిశగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని కథనాలొస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమే అయితే తారక్ - విజయ్ మల్టీస్టారర్ అనేది అభిమానులకు పండగ లాంటి వార్తే.

నిజానికి తారక్ - రామ్ చరణ్ కలయికలో ఆర్.ఆర్.ఆర్ కూడా ఊహించనిది. అనూహ్యంగా ఈ కాంబినేషన్ ని తెరపైకి తెచ్చారు రాజమౌళి. భారీ పాన్ ఇండియా చిత్రంగా రూపాంతరం చెందింది. అలానే అట్లీ ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. ఇక తారక్ లైనప్ చూస్తే.. కొరటాల-ప్రశాంత్ నీల్- బుచ్చిబాబు అంటూ పెద్ద లైనప్ సెట్ చేసి రెడీగా ఉన్నాడు. ఇదే క్యూలో అట్లీ సినిమా వచ్చి చేరుతుందేమో చూడాలి. అయినా తారక్ -అట్లీ కాంబినేషన్ పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.