ఫ్లాప్ అని తెలిసినా టీమ్ ఎక్కడా తగ్గట్లే!

Sun Jun 26 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

Young Heros In Tollywood

దాదాపు ఏడేళ్లుగా ఓ యంగ్ హీరో బాక్సాఫీస్ పై దండెత్తుతూనే వున్నాడు. కానీ ఫలితం కనిపించడం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి తండ్రి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్ననాటి పాత్రల్లో మెరిసాడు. ఆ తరువాత ఏడేళ్ల క్రితం హీరోగా జర్నీ మొదలు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఏడేళ్లుగా నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. రిలీజ్ టైమ్ లో భారీగా హడావిడీ చేసిన ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయాయి.తాజాగా ఐదవ ప్రయత్నంగా తాజాగా ఓ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కరోనా కారణంగా ఈ యంగ్ హీరో నటించి రెండు సినిమాల రిలీజ్ లు గత కొంత కాలంగా వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా చేసిన మూవీ కూడా కరోనా తరువాత విడుదలై పెద్దగా ప్రభావాన్ని చూపించకుండానే థియేటర్లలోంచి వెళ్లిపోయింది. ఇక పక్కా మాస్ క్యారెక్టర్ లో తెలిసిన దర్శకుడితో తాజాగా ఓ మూవీ చేశాడు.

ఈ మూవీ రిలీజ్ కి ముందు భారీగా హడావిడి చేశారు. పెద్ద హీరో సినిమాకు ఏస్థాయిలో నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ నిర్వహిస్తారో అదే స్థాయిలో ఈ మూవీకి ప్రమోషన్స్ ని మేకర్స్ ప్లాన్ చేశారు. గతంలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ స్టోరీలతో సినిమాలు చేసి వార్తల్లో నిలిచిన దర్శకుడు తెరకెక్కించిన సినిమా కావడం.. హైదరాబాదీ నేటి విటీకి దగ్గరగా వుండే కథ కథనాలతో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తుందని టీమ్ ఊహించింది.

కానీ ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. రోటీన్ కథ అని ఇప్పుడు ఇది వర్కవుట్ కాదని ప్రేక్షకులు కామెంట్ లు చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అని తేల్చారు. అయినా సరే మేకర్స్ మాత్రం ఎక్కడా తగ్గేదిలే అన్నట్టుగా ఫ్లాప్ అని తెలిసినా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. భీమవరం ప్రొడ్యూసర్ లు భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈ మూవీ వారికి భారీ నష్టాలని అందించింది.

అయినా సరే ఇంకా హోప్ ని వదలకుండా ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేస్తూనే వున్నారు. రీసెంట్ గా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ ప్రొడ్యూసర్ మాట్లాడిన మాటలతో ఈ మూవీ మరింతగా ట్రెండ్ అయింది. అయినా సినిమాలో సరైన కంటెంట్ లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలడలేకపోతోంది. అయినా సరే ప్రొడ్యూసర్స్ భారీగా ప్రచారానికి ఖర్చు చేస్తుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.