Begin typing your search above and press return to search.

చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీయడానికి అన్నేళ్ల సమయం కావాలా...?

By:  Tupaki Desk   |   20 Oct 2020 1:30 AM GMT
చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీయడానికి అన్నేళ్ల సమయం కావాలా...?
X
టాలీవుడ్ స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్ల నుంచి ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమా రిలీజ్ అయితే గొప్పగా చెప్పుకుంటాం. వాళ్ళకి సరైన కాంబినేషన్ కుదిరి అది ప్రారంభమవాడనికి.. అది పూర్తవడానికి.. ఫైనల్ గా విడుదల కావడానికి చాలా సమయమే పడుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోలు దర్శకులు అందరూ స్లో అండ్ స్టడీగా వెళ్తున్నవారే. అయితే ఈ మధ్య కొందరు యువ దర్శకులు.. యువ హీరోలు కూడా ఒక్కో సినిమా తీయడానికి సంవ‌త్స‌రాలు తీసుకుంటున్నారు. చిన్న సినిమాలు మరియు మీడియం రేంజ్ సినిమాలు తీయ‌డానికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీని కారణంగానే టాలీవుడ్ లో కంటిన్యూగా స‌క్సెస్ లు రావ‌డం గ‌గ‌నం అయిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉదాహరణకు త‌రుణ్ భాస్క‌ర్ - వెంకీ కుడుముల - చందు మొండేటి - సుధీర్ వ‌ర్మ వంటి యంగ్ డైరెక్టర్స్ సక్సెస్ ఫుల్ సినిమాలు తీసినప్పటికీ.. సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. అలానే అడివి శేష్ - న‌వీన్ పోలిశెట్టి వంటి టాలెంటెడ్ హీరోలు కూడా వారిని స‌పోర్ట్ గా స్లో అండ్ స్టడీగా వెళ్తున్నారు. ఇలా చెప్ప‌కుంటూ పోతే ఒక్కో సినిమాకి సంవత్సరాల సమయం తీసుకునేవారి లిస్ట్ చాలా పెద్ద‌దే ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో వర్థమాన రచయితలు దర్శకులు పోటాపోటీగా కొత్త కథలను సిద్ధం చేస్తున్నారు. కానీ వారి నుంచి సినిమాలు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. ఎవరో ఒకరిద్దరు మాత్రం హిట్ ప్లాపులను పట్టికుంచుకోకుండా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాని లైన్లో పెట్టుకుంటూ వెళ్తున్నారు. మిగతా యువ దర్శకులు.. యువ హీరోలు కూడా అదే ఫాలో అవుతూ వస్తే టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు రావడంతో పాటు సక్సెస్ రేట్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి.