Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా నేర్పుతున్న పాఠాలు

By:  Tupaki Desk   |   12 Sep 2019 7:15 AM GMT
పాన్ ఇండియా నేర్పుతున్న పాఠాలు
X
ఈ మధ్య కాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా మంది హీరోలు తమ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నామని చెప్పుకోవడం ఫైనల్ గా కామెడీకి దారి తీసేలా ఉంది. స్టార్ హీరోతో వందల కోట్లు బడ్జెట్ పెట్టి తీసినప్పుడు వాటిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకున్నా ఒక అర్థం ఉంటుంది. ఎలాగూ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన హీరోలు కాబట్టి మార్కెట్ కూడా ఉంటుంది. ఓపెనింగ్స్ రూపంలోనే నిర్మాతలు ఒడ్డెక్కించే ప్రయత్నం చేస్తారు.వీటికి సాహో సైరా లాంటి వాటిని ఉదాహరణలుగా చెప్పొచ్చు.

అంతే తప్ప ఐదారు కోట్లలో తీసిన మీడియం బడ్జెట్ సినిమాలు చేసిన అప్ కమింగ్ హీరోలు సైతం ఈ పాన్ ఇండియా మోజులో పడిపోయి కథలను కంటెంట్ ని గాలికి వదిలేయడం చూస్తే కేవలం పబ్లిసిటీతో వసూళ్లు వచ్చేస్తాయన్న భ్రమలో ఉన్నారనిపిస్తోంది. దీని మీద ఫిలిం నగర్ సర్కిల్స్ లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవలే ఓ సీనియర్ హీరో అఫ్ ది రికార్డు మాట్లాడుతూ ముందు మన హీరోలను తెలుగులోనే సరిగ్గా సినిమాలు తీసి ఆ తర్వాత పాన్ ఇండియా అంటూ వేరే బాషల మీద పడమని చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇందులో వాస్తవం లేకపోలేదు. డబ్బింగ్ చేసి ఇతర భాషల్లో వదిలితే కొంత రెవిన్యూ పెరుగుతుంది కానీ అక్కడివాళ్లు మనల్ని నెత్తిమీద పెట్టుకునే సీన్ ఉండదు. ఏదో బన్నీ లాంటి ఒకరిద్దరికి మినహాయింపు ఉంటుందే తప్ప అందరూ అలా చేయడానికి వెళ్తే చేతులు కాలతాయి. అందుకే ఈ పాన్ ఇండియా మైకాన్ని వదిలేసి కాస్త కథల ఫోకస్ పెంచితే బెటర్