యంగ్ హీరో వాడకం మామూలుగా లేదండోయ్!

Tue Aug 16 2022 06:00:01 GMT+0530 (IST)

Young Hero Kiran Abbavaram

ఫేమ్  ఉన్న వారిని  వినియోగించుకోవడం అన్నది ఓ ఆర్ట్. దాదాపు యంగ్ హీరోలంతా ఫేం ఉన్న వారిని  సీన్ లోకి తీసుకొచ్చి  తమ సినిమా ప్రచారం  కోసం వాడుకుంటారు. హీరోలు సైతం అలాంటి వాటికి కాదనకుండా సహకరిస్తారు. పైకొస్తే అంతకన్నా కావాల్సింది ఏముందని దాదాపు స్టార్ హీరోలంతా వీలైనంత వరకూ వాళ్లకు సహకరించడానికి ప్రయత్నిస్తుంటారు.ఇండస్ర్టీకి  కొత్త నీరు అవసరం ఎంతైనా ఉందని అంటుంటారు. ఆ మాట ప్రకారమే కొందరు స్టార్లు అన్ని రకాలుగా సహకరిస్తుంటారు. కొంత కాలంగా  మెగాస్టార్ చిరంజీవి చిన్న సినిమాల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. నేరుగా ఆయన చేతుల మీదుగానే సినిమాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇంటికి పిలిపించి పోస్టర్..ట్రైలర్..టీజర్ లాంటివి చేసి పెడుతుంటారు. ఇదే తరహాలో నాగార్జున..వెంకటేష్..బాలకృష్ణ..సహ హీరోలంతా సహకరిస్తున్నారు. అయితే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మెగాస్టార్ చిరంజీవి పేరుని మాత్రం ఓ రేంజ్ లో వినియోగిస్తున్నట్లే కనిపిస్తుంది. ఇంత వరకూ మెగా హీరోలే అంత ధైర్యం చేయలేదు. అలాంటింది ఈ యంగ్ హీరో ఓ సినిమా విషయంలో చిరంజీవి పాత సినిమా టైటిల్ ని వినియోగించుకుని బోలెడంత ప్రచారం పొందుతున్నాడు.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా  'నేను మీకు బాగా కావాల్సిన వాడిని 'అనే చిత్రం తెరకెక్కుతోంది. శ్రీధర్ గాదే ఈ చిత్రాని  దర్శకత్వం వహిస్తున్నారు.  ఈసినిమా ప్రచారంలో భాగంగా కిరణ్ చిరంజీవి పాత సినిమా గురించి గుర్తుచేసి సంచలనం రేపాడు. అంతేకాదు ఎంతో డేరింగ్ గా 'గ్యాంగ్ లీడర్' లాంటి సినిమా తీసామనడం విశేషం.

"మా సినిమా ప్రధమార్థం అంతా వినోదాత్మకంగా సాగుతుంది.  సెకెండ్ హాఫ్ మాత్రం ఫుల్ మాస్ గా ఉంటుంది. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా తరహాలో ప్లాన్ చేసాం. ఆ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా మా సినిమా ఉంటుందనే''సాడు. దీంతో  మెగా అభిమానులు యంగ్ హీరోకి ఎంత ధైర్యం?  చిరంజీవి సినిమాతోనే తన సినిమాని పోల్చుతాడా? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

నిజమే చిరంజీవి సినిమాతో పోల్చుకోవడం అంటే  గట్స్ ఉండాలి. ఔట్ ఫుట్ పై ఎంతో నమ్మకం ఉండాలి.  మరి సినిమాలో అంతుందా?  లేదా? అన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. గతంలో ఇదే హీరో బాలయ్య బాబు ఇమేజ్ ని సైతం వాడుకున్నాడు. మనకేదైనా బాలయ్య బాబే అంటూ అతను ఫ్యాన్ అన్నట్లు చెప్పుకొచ్చాడు.

ఇప్పుడా స్థానంలో చిరంజీవి వచ్చినట్లు కనిపిస్తుంది. మొత్తానికి యంగ్ హీరో మెగా  ఫ్యాన్స్ క్రేజ్ ని కూడా ఎన్ క్యాష్ చేసుకునే ప్లాన్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించడం విశేషం. సినిమాలో పాటలు హైలైట్ గా నిలుస్తాయని టీమ్ ధీమా వ్యక్తం చేస్తుంది.