యంగ్ హీరో.. క్రేజీ హీరోయిన్ ప్రాజెక్ట్ ఆగినట్టేనా?

Wed Dec 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Controversial About Young Hero.. Crazy Heroine Project

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లు విచిత్రంగా అనిపిస్తుంటాయి. సంబంధం లేని హీరో.. తనకంటే భారీ క్రేజ్ వున్న హీరోయిన్ లని కలిపి సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఇదేం కాంబినేఫషన్ అనే చర్చ మొదలవుతూ వుంటుంది. సరిగ్గా అలాంటి చర్చే యంగ్ హీరో.. క్రేజీ హీరోయిన్ ప్రాజెక్ట్ పై గత కొంత కాలంగా జరుగుతోంది.రీసెంట్ గా కామెడీ ఎంటర్ టైనర్ తో ఊహించని విధంగా రికార్డు స్థాయి వసూళ్లని వరల్డ్ వైడ్ గా రాబట్టి సెన్సేషన్ గా నిలిచిన యంగ్ హీరో.. కొన్నేళ్ల క్రితం పాన్ ఇండియా మూవీతో ఆకట్టుకున్న క్రేజీ హీరోయిన్ ల కలయికలో కొన్ని నెలల క్రితం ఓ మూవీని ప్రారంభించారు.

ఓ క్రేజీ నిర్మాణ సంస్థ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని మొదలు పెట్టింది. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీ కి సంబంధించిన చిన్న అప్ డేట్ ని కూడా మేకర్స్ ఇంత వరకు బయటికి రిలీజ్ చేయలేదు. కానీ షూటింగ్ జరుగుతోందంటూ వార్తలు వినిపించడం మొదలైంది.

యంగ్ హీరో తనకు అక్కలా కనిపించే హీరోయిన్ .. ఈ కాంబినేషన్ లో సినిమా ఏంటీ గురూ? అంటూ ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసిన ప్రతీ నెటిజన్ కామెంట్ లు చేయడం మొదలు పెట్టారు.

అయినా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని అధికారికంగా ఇంత వరకు ప్రకటించలేదు. ఇదిలా వుంటే రీసెంట్ గా ఇదే మూవీ కాన్సెప్ట్ తో ఓ  సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో సదరు యంగ్ హీరో.. క్రేజీ హీరోయిన్ తో క్రేజీ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సినిమా పరిస్థితి ప్రశ్నార్థకంలో పడిపోయింది. సినిమాలో హీరో స్పెర్మ్ డోనర్.. ఇదే కాన్సెప్ట్ తో రీసెంట్ గా ఓ సినిమా రావడంతో మేకర్స్ ఆలోచనలో పడ్డారట.

అదే కాన్సెప్ట్ తో మళ్లీ సినిమా చేసి చేతులు కాల్చుకోవడం అవసరమా? అని సదరు యంగ్ హీరో.. క్రేజీ హీరోయిన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ని నిలిపి వేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చిన కథతో మళ్లీ సినిమా చేస్తే ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని గ్రహించిన మేకర్స్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని అర్థాంతరంగా నిలిపివేసినట్టుగా ఇన్ సైడ్ టాక్.