లిప్ లాక్ సీన్స్ చేయనని తెగేసి చెప్పిన కుర్ర భామ..!

Sun Jan 23 2022 05:00:01 GMT+0530 (IST)

Young Actress lip lock Scenes

సినిమా హీరోయిన్లకు ఎంత అందం అభినయం ఉన్నా కూసింత గ్లామర్ షో చేసే వారివైపే ఫిలిం మేకర్స్ మొగ్గు చూపుతుంటారు. అలాంటివేమీ చేయకుండా స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారనుకోండి. అవకాశాల కోసం ఒక్కసారి స్కిన్ షో చేసి అందాల గేట్లు తెరిచేస్తే మాత్రం.. హీరోలు దర్శకనిర్మాతలతో పాటుగా సినీ అభిమానులు కూడా వారి నుంచి ప్రతిసారీ అలాంటివే ఎక్సపెక్ట్ చేసేవారు ఎక్కువ ఉంటారు.ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఓ యంగ్ బ్యూటీ ఇటీవల ఓ ఇంటిమేట్ సీన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తొలి సినిమాతోనే యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ అందమైన కుర్ర భామ.. రీసెంటుగా ఓ సినిమాలో సుదీర్ఘమైన లిప్ లాక్ సీన్ చేసింది. ఇంగ్లీషు సినిమాల తరహాలో ఉన్న ఈ గాఢమైన చుంబన దృశ్యాలు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఆల్రెడీ అలాంటి సన్నివేశాలలో నటించడంతో ఇప్పుడు రాబోయే సినిమాల్లో కూడా కిస్సింగ్ సీన్స్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం అమ్మడు నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల రీషూట్ కోసం పిలుస్తున్నారట. యూత్ ని ఆకట్టుకునే ప్రేమకథ కావడంతో లిప్ లాక్ సీన్స్ కోసం హీరోయిన్ ని రిక్వెస్ట్ చేస్తున్నారట.  

అయితే యంగ్ బ్యూటీ మాత్రం తాను ఎలాంటి లిప్ లాక్ సీక్వెన్స్ చేసేది లేదని తెగేసి చెప్పిందట. అంతేకాదు ఈ విషయంలో మరీ ఫోర్స్ చేస్తే అసలు ఆ ప్రాజెక్ట్ కోసం రీషూట్ కూడా చేయనని హెచ్చరించిందట. ఏదేమైనా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలని వచ్చిన ఆ బ్యూటీ.. కథ డిమాండ్ చేసిందని కిస్సింగ్ సీన్ చేయడం వల్ల ఈ డిమాండ్స్ తప్పడం లేదని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.