చియాన్ వర్సెస్ బుల్లి చియాన్.. ఏంటి కథ?

Sat Jan 29 2022 13:00:01 GMT+0530 (IST)

Yevvarra Manaki Custody Lyrical song

విక్రమ్ నటించిన 60వ చిత్రం బహుభాషా యాక్షన్ థ్రిల్లర్ `మహాన్` కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో విక్రమ్ వారసుడు బుల్లి చియాన్ ధృవ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రీమియర్ ప్రదర్శనకు ముందు రెండవ సింగిల్ ని విడుదల చేస్తున్నారు. అన్ని భాషల వెర్షన్లను విడుదల చేస్తుండడం విశేషం.`ఎవండా ఎనకు కస్టడీ` (తమిళం).. `ఎవ్వర్రా మనకి కస్టడీ` ( తెలుగు).. `ఇని ఈ లైఫ్` (మలయాళంలో) .. యవనో నమగే కస్టడీ (కన్నడలో) వెర్షన్స్ ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శితం కానుంది. తమిళ-మలయాళం- తెలుగు- కన్నడ భాషలలో అందుబాటులో ఉంటుంది. కన్నడలో మహా పురుష అనేది టైటిల్. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. `మహాన్` అనేది ఒక వ్యక్తి తన ఆశయాల సాధన కోసం చేసే పోరాటంలో ఆ ఆశయాల నుండి తప్పుకున్నప్పుడు అతని కుటుంబం దూరమైతే ఏం జరిగింది అనేదే సినిమా కథాంశం. అతను తన ఆశయాన్ని సాధించుకునే క్రమంలో అతను తన కొడుకు ఉనికిని కోల్పోతాడు. బిలియనీర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్న తర్వాత జీవితం అతనికి తండ్రి అయ్యే అవకాశం ఇస్తుందా? అతడి కొడుకు ఎలా రియాక్టవుతాడు? అన్నది ఉత్కంఠభరితమైన యాక్షన్-ప్యాక్డ్ జర్నీగా  ఊహించని సంఘటనల పరంపరలో అతని జీవితం ఎలా సాగుతుంది అనేదే ఈ కథ. చియాన్ బుల్లి చియాన్ పోటీపడి నటించిన సినిమా ఇదన్న టాక్ వినిపిస్తోంది.