ట్రైలర్ టాక్: ఏడు చేపల కథ చెప్తా

Tue Oct 15 2019 11:12:48 GMT+0530 (IST)

ఏడు చేపల కథ' టీజర్ రిలీజై చాలా రోజులైంది. ఆ టీజర్ చూసినవాడు బూతు ప్రియుడైనా.. బూతు వ్యతిరేకి అయినా టీజర్ ను.. టెంప్ట్ రవిని మర్చి పోలేడు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఎదురుచూసిన నాటీ బాయ్స్ చాలామందే ఉన్నారు కానీ అదేమో ఎంతకీ రిలీజ్ కాదాయె!  సరే.. మేకర్స్ కు ఏం ఇబ్బందులో మరి.  తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.దాదాపు రెండున్నర నిముషం ఉన్న ఈ ట్రైలర్లో కామెడీ తక్కువగా.. కథలోని సస్పెన్స్ ఎక్కువగా ఎలివేట్ చేసే తరహాలో ఉంది. టీజర్ ఆరంభంలో ఒక లేడీ "నేను తప్పు చేశాను" అంటుంది. మరో లేడీ "నేను తప్పు చేయలేదు" అంటుంది.  ఇంకో మహిళా శవంగా ఉంటుంది.  మరో మహిళా బందీగా ఉంటుంది. ఈ గోల మధ్యలో సుందర్ అనే వ్యక్తిని ఒక సైకో లాగా చూపించారు.  ఇక ఈ సుందర్ కు ఒక స్త్రీ 'ఏడు చేపల కథ చెప్తా' అంటుంది.  అప్పుడు మన టెంప్ట్ రవి కనిపిస్తాడు.  తను అమ్మాయిల వెనక తిరగడానికి కారణం తనే చెప్తాడు.. 'ముప్పై రోజులకోసారి బ్లడ్ ఎక్కించుకోకపోతే బతకను సర్' అంటాడు.

ఓవరాల్ గా చూస్తే ట్రైలర్ ఎక్స్ ట్రా ఆర్డినరీగా ఏమీ లేదు.  మరి సినిమా ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక బూతు అంటారా.. ఫుల్ గా ఉంది. అయినా హరర్ సినిమాలో దెయ్యం ఉండకూడదు. క్రైమ్ సినిమాలో రక్తం కనపడకూదరు.. అడల్ట్ సినిమాలో బూతు ఉండకూడదు అనే మనకు తెలియకుండానే అలవాటైపోయిన వితండవాదాలు పక్కన పెట్టి బూతును చూసేయండి. బూతు ఇష్టం లేదు.. మేము చూడము అంటే.. ట్రైలర్ ను చూడకుండా మూసుకుంటే సరి..కళ్ళు!