Begin typing your search above and press return to search.

ఏళ్ల త‌ర‌బ‌డి వెయిటింగ్ ఫ‌లించింది దేవుడా!

By:  Tupaki Desk   |   24 Jan 2021 5:30 AM GMT
ఏళ్ల త‌ర‌బ‌డి వెయిటింగ్ ఫ‌లించింది దేవుడా!
X
ఒకే ఒక్క స‌రైన ఆఫ‌ర్ .. త‌న కెరీర్ నే మార్చేసే గ్రేట్ ఆఫర్ .. త‌న‌వైపు వ‌స్తే ఏ ఆర్టిస్టుకు అయినా ఆ ఆనందం అనంతం. అప‌రిమితం.. ఇప్పుడు అలాంటి అరుదైన ఛాన్స్ ద‌క్కించుకుంది ప్ర‌గ్య జైశ్వాల్. ఏళ్ల త‌ర‌బడి వేచి చూసినందుకు ఈ అమ్మ‌డికి ఇప్ప‌టికి ఫ‌లం ద‌క్కుతోంది.

అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స‌ర‌స‌న `యాంటిమ్` అనే భారీ మాఫియా యాక్ష‌న్ డ్రామా చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకుంది. మహేష్ మంజ్రేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స‌ల్మాన్ అంత‌టి పెద్ద హీరో స‌ర‌స‌న ఆఫ‌ర్ అంటే ఇక‌పై బాలీవుడ్ లో నాలుగైదేళ్ల పాటు ప్ర‌గ్య‌కు ఛాన్సులు క‌ష్ట‌మేమీ కాదు. స‌ల్మాన్ రిక‌మండేష‌న్ వ‌ర్క‌వుట్ కావొచ్చన్న‌ది ఓ అంచ‌నా. అయితే ప్ర‌తిసారీ సినిమా జ‌యాప‌జ‌యాలు కూడా ఫేట్ మార్చేసే వీలుంది.

మ‌రోవైపు ప్ర‌గ్య టాలీవుడ్ లో ఢీ సీక్వెల్ లో న‌టించేందుకు సంత‌కం చేసింద‌ని ఇదివ‌ర‌కూ క‌థ‌నాలొచ్చాయి. విష్ణు మంచు- శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ ప్ర‌గ్య‌కు అవ‌కాశం ఇచ్చార‌న్న టాక్ వినిపించింది. అలాగే కంచె డైరెక్ట‌ర్ క్రిష్ రిక‌మండేష‌న్ తో ప‌వ‌న్ స‌ర‌స‌న ప్ర‌గ్య న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంద‌‌ని.. బాల‌య్య స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టిస్తోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ప్ర‌గ్య లాంగ్ వెయిటింగ్ ఫ‌లించిన‌ట్టేన‌న్న‌ది అభిమానుల మాట‌.

ఇక యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్ విష‌యానికి వ‌స్తే.. స‌ల్మాన్ బావ గారైన‌ ఆయుష్ శర్మ గ్యాంగ్ ‌స్టర్ ‌గా నటించాడు. ఆ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు త‌ల‌ప‌డుతున్న టీజ‌ర్ ఇటీవ‌ల రిలీజ‌వ్వ‌గా అది అంత‌ర్జాలంలో సెన్సేష‌న్ సృష్టించింది. యాంటిమ్ పూణే వీధుల్లో ఆరంభ‌మైంది. ఆయుష్ పై కొన్ని వారాల చిత్రీక‌ర‌ణ‌ తరువాత ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో సిక్కు పోలీసుగా సల్మాన్ ఖాన్ సెట్స్ లో చేరాడు. అప్పటినుండి వీరిద్దరూ ముంబైలోని కొన్ని రియల్ లొకేషన్లలో స్టూడియోలలో నాన్ స్టాప్ షూటింగ్ ‌లో ఉన్నారు. ఇటీవ‌లే ప్ర‌గ్య లొకేష‌న్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అప్ప‌టికే త‌ను షూటింగులో బిజీగా ఉంద‌న్న స‌మాచారం రివీలైంది. ``ప్ర‌గ్య‌ గత కొన్ని రోజులుగా మొత్తం యాంటీమ్ బృందంతో నిశ్శబ్దంగా షూటింగ్ చేస్తున్నారు. మహాబలేశ్వర్ షెడ్యూల్ లో కూడా త‌ను ఒక‌ భాగం. ఆమె సల్మాన్ లేడీ లవ్ గా క‌నిపిస్తుంది. ఆ ఇద్దరికీ ఈ చిత్రంలో రొమాంటిక్ సాంగ్ ఉంటుంది`` అని తెలిసింది. 2021 ద్వితీయార్థంలో యాంటిమ్ రిలీజ్ కానుంది.