Begin typing your search above and press return to search.

KGF హీరో చేతుల్లోకి పెప్సీ..!

By:  Tupaki Desk   |   24 Jan 2023 3:50 PM GMT
KGF హీరో చేతుల్లోకి పెప్సీ..!
X
స్టార్ హీరో అనగానే వారి చేతుల్లో సినిమాలే కాదు పలు రకాల బ్రాండ్ లు కూడా ఉంటాయి. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలు రెండు చేతులా సంపాదిస్తున్నారు స్టార్స్. ఈ క్రమంలో ప్రేక్షకులు మెచ్చే ఏ హీరోతో అయినా వారి బ్రాండ్ ని ప్రమోట్ చేయించుకుంటారు వాణిజ్య సంస్థలు. టాలీవుడ్ స్టార్స్ లో యాడ్స్ అంటే అందరికి గుర్తొచ్చేది మహేష్ బాబే. ఆయన సినిమాలతో పాటుగా బ్రాండింగ్ లోనూ తన సత్తా చాటుతున్నారు.

ఆయన దారిలోనే అల్లు అర్జున్, రాం చరణ్, ఎన్.టి.ఆర్, ప్రభాస్ ఇలా పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటున్నారు. వీరితో పాటుగా ఇప్పుడు కె.జి.ఎఫ్ స్టార్ కూడా జత కలిశాడు.

కె.జి.ఎఫ్ మొదటి రెండు చాప్టర్స్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ గా మారాడు యశ్. అంతకుముందు అతనెవరో తెలియకపోయినా సరే కె.జి.ఎఫ్ రెండు పార్ట్ లు చూసి అతనికి అభిమానులుగా మారారు. కె.జి.ఎఫ్ క్రేజ్ తో యశ్ కూడా సూపర్ స్టార్డం తెచ్చుకున్నాడు.

అదే ఇప్పుడు అతనికి ఒక శీతలపానీయ సంస్థతో డీల్ కుదుర్చుకునేలా చేసింది. ఎన్నో ఏళ్లుగా చల్ల చల్లగా ప్రజల దాహం తీరుస్తున్న పెప్సీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కె.జి.ఎఫ్ యశ్ ఉంటున్నారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో షేర్ చేశాడు యశ్. కంగ్రాచ్యులేషన్స్ పెప్సీ ఐలవ్యూ అంటూ ఒక మాటతో పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా తను ఉంటున్నట్టు ప్రకటించాడు.

కె.జి.ఎఫ్ తో సెన్సేషనల్ గా మారిన యశ్ పెప్సీని ప్రమోట్ చేయడం ఆయన ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కె.జి.ఎఫ్ తర్వాత తన నెక్స్ట్ సినిమా కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ లో చేస్తున్నట్టు టాక్. దీనికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

యశ్ తో తెలుగు మేకర్స్ కూడా సినిమా ప్లానింగ్ లో ఉన్నారని టాక్. అంతకుముందు తెలుగు స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు పెప్సీని ప్రమోట్ చేశారు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత పెప్సీ తన మార్కెటింగ్ మీద దృష్టి పెట్టింది. అందుకే లేటెస్ట్ గా యశ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.