Begin typing your search above and press return to search.

య‌ష్‌ క్రేజ్.. పాత సినిమాలు దించేస్తున్నారు

By:  Tupaki Desk   |   23 May 2022 9:30 AM GMT
య‌ష్‌ క్రేజ్.. పాత సినిమాలు దించేస్తున్నారు
X
ఒక డ‌బ్బింగ్‌ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిస్తే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌ని అందులో న‌టించిన హీరో కు సంబంధించిన పాత సినిమాల‌ని తెలుగులో డ‌బ్బింగ్ చేస్తుంటారు. ఇప్ప‌డు కూడా అదే జ‌రుగుతోంది. `కేజీఎఫ్` సిరీస్ తో తెలుగుతో పాటు యావ‌త్ దేవ వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో య‌ష్‌.

ఈ మూవీతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చాడీ క‌న్న‌డ రాకింగ్ స్టార్. ఈ సినిమాకు ముందు క‌న్న‌డ‌లో య‌ష్ మీడియం రేంజ్ హీరో. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ అంటే శివ రాజ్ కుమార్‌, పునీత్ రాజ్ కుమార్, ఉపేంద్ర‌, కిచ్చా సుదీప్ అంత వ‌ర‌కే తెలుసు.

కానీ `కేజీఎఫ్`తో క‌న్న‌డ నాట య‌ష్ అనే హీరో కూడా వున్నాడ‌ని యావ‌త్ ప్ర‌పంచానికి తెలిసింది. 2018లో విడుద‌లై `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` సైలెంట్ గా వ‌చ్చి మోన్ స్టర్ హిట్ ని ద‌క్కించుకుంది. పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి య‌ష్ కెరీర్ లోనే భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా రికార్డు సాధించింది. ఈ మూవీ త‌రువాత దీనికి సీక్వెల్ గా వ‌చ్చిన `కేజీఎఫ్ 2` ఇటీవ‌ల విడుద‌లై రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ లో రూ. 400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి తిరుగులేని రికార్డుని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 14న భారీ స్థాయిలో ఐదు భాష‌ల్లో విడుద‌లైన `కేజీఎఫ్ 2` ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. దీంతో య‌ష్ క్రేజ్ భారీ స్థాయికి చేరింది. ఈ మూవీ త‌రువాత పార్ట్ 3ని కూడా చేయ‌బోతున్నామంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డంతో ప్రేక్ష‌కులు, య‌ష్ అభిమానులు పార్ట్ 3 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా వుంటే య‌ష్ క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు కొంత మంది ప్రొడ్యూస‌ర్స్‌. య‌ష్ న‌టించిన కొన్ని చిత్రాల‌ని తెలుగులో అనువాదం చేస్తూ `కేజీఎఫ్` క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో భాగంగా 2012లో య‌ష్ - ర‌మ్య స్పంద‌న జంట‌గా న‌టించ‌గా డా. సూరి డైరెక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ `ల‌క్కీ` ని తెలుగులో `ల‌క్కీ స్టార్‌` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ‌దుర్గ ప‌ర‌మేశ్వ‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రాధికా కుమార‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌విరాజ్ ఈ మూవీని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. గ్రే హెయిర్, వెరైటీ గా డిజైన్ చేసిన గ‌డ్డం.. క్రాఫ్.. చేత‌లో ఫ్ల‌వ‌ర్ బొకే.. సైకిల్ పై హీరోయిన్ ర‌మ్య‌తో య‌ష్ క‌నిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. `కేజీఎఫ్‌` క్రేజ్ ఈ సినిమాకు ఎంత వ‌ర‌కు క‌లిసి వ‌స్తుందో.. నిర్మాత‌కు ఏ స్థాయి లాభాల్ని అందిస్తుందో చూడాలి అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.