సగటు ఇల్లాలిని తలపిస్తున్న తెలుగమ్మాయ్

Wed May 12 2021 21:21:03 GMT+0530 (IST)

Yamini Bhasker Latest Photo

తెలుగు పరిశ్రమలో తెలుగమ్మాయిలకు కొదవేమీ లేదు. ఈ రంగంలో పెద్ద అవకాశాల కోసం వేచి చూస్తూ ఎందరో ఔత్సాహిక నటీమణులు తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. తెలుగమ్మాయ్ యామిని భాస్కర్ జర్నీ అలా ఆసక్తిని కలిగించేదే. కొత్తగా మా ప్రయాణం- భలే మంచి చౌకా బేరం - రభస లాంటి మీడియం బడ్జెట్ చిత్రాల్లో యామిని నటించింది.జూనియర్ ఎన్టీఆర్ `రభస` చిత్రంలో యామిని పాత్రకు చక్కని గుర్తింపు దక్కింది. ఇక రాజీవ్ సాలూరి సరసన టైటానిక్ (2016) అనే చిత్రంలోనూ యామని నటించింది. 2015లో `కీచక` ప్రమోషన్స్ లో తనకు పెద్ద స్టార్ అవ్వాలని ఉందని యామిని మీడియాకు వెల్లడించారు. నటిగా నిరూపించుకునే సత్తా తనకు ఉందని ధీమాను వ్యక్తం చేశారు ఈ బ్యూటీ.

యామిని భాస్కర్ తాజాగా కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేశారు. ఒక అందమైన పల్లె పట్టు ఆడపడుచుగా యామిని ఆకట్టుకుంటున్నారు. జరీ అంచు చీరకట్టు.. చింతపిక్క రంగు రవికె.. కాలికి మువ్వలు.. మెడలో నల్లపూసలతో సగటు ఇల్లాలి లుక్ లో యామీ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఫోటోగ్యారేజ్ లో ఇండోర్ ఫోటోషూట్ ఇది. ఒక ప్రయివేట్ స్టూడియోలో ఈ ఫోటోషూట్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. యామిని భాస్కర్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.